Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1062 | Keerthana 372 , Volume 20
Pallavi: Amdukemi Dosamaa Avunayya (అందుకేమి దోసమా అవునయ్య)
ARO: Pending
AVA: Pending
Ragam: Desalam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అందుకేమి దోసమా అవునయ్య
యెందును రాజులకుఁ దప్పేడ లేదయ్యా ॥ పల్లవి ॥
యేకతము నీతో నాడి యెదుట నిలుచున్నది
చేకొని ఆపెకు బుద్దిచెప్పవయ్యా
ఆకడి పరాకయ్యేవు అండ నే మున్నారమని
యీకడ వండివార్చి దొమ్మిఁక నేలయ్యా ॥ అందు ॥
సన్నలు నీతోఁ జేసి సరసములాడీని
వున్నతి నాపెకు లోనై వుండవయ్యా
తిన్ననిసిగ్గువడేవు దిష్టించి మామోము చూచి
అన్నిటా గరిడి చొచ్చి అడఁగనేలయ్యా ॥ అందు ॥
సెలవుల నవ్వు నవ్వి శిరసు వంచుకున్నది
మలసి సందేహము మానుపవయ్యా
అలరి శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
ఫలము చేకొన్నమీఁదఁ బదరనేలయ్యా ॥ అందు ॥
Pallavi
Andukēmi dōsamā avunayya
yendunu rājulakum̐ dappēḍa lēdayyā
Charanams
1.Yēkatamu nītō nāḍi yeduṭa nilucunnadi
cēkoni āpeku buddiceppavayyā
ākaḍi parākayyēvu aṇḍa nē munnāramani
yīkaḍa vaṇḍivārci dom’mim̐ka nēlayyā
2.Sannalu nītōm̐ jēsi sarasamulāḍīni
vunnati nāpeku lōnai vuṇḍavayyā
tinnanisigguvaḍēvu diṣṭin̄ci māmōmu cūci
anniṭā gariḍi cocci aḍam̐ganēlayyā
3.Selavula navvu navvi śirasu van̄cukunnadi
malasi sandēhamu mānupavayyā
alari śrīvēṅkaṭēśa aṭṭe nannum̐ gūḍitivi
phalamu cēkonnamīm̐dam̐ badaranēlayyā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.