Main Menu

Anatichchite Nemaaya Namdukeme (ఆనతిచ్చితే నేమాయ నందుకేమే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1698 | Keerthana 584 , Volume 26

Pallavi:Anatichchite Nemaaya Namdukeme (ఆనతిచ్చితే నేమాయ నందుకేమే)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనతిచ్చితే నేమాయ నందుకేమే
వూని నేమెంతడిగినా నూరకుండేవేమే   ॥ పల్లవి ॥

చక్కఁగా నీయాతనిసందివావి యెట్టిదంటే
చెక్కుచేతితో సిగ్గున జెందేవేమే
పిక్కటిల్లి మీ మేనుల పెంజెమట గారీనంటే
తక్కక ఇంతటిలోనే తలవంచేవేమే    ॥ ఆన ॥

గట్టిగా నీతో నాతనికతలు నేఁ జెప్పఁగాను
గుట్టుతో నుందానవు వూఁకొనవేమే
జట్టిగా మీముందరను సరివిడేలు వెట్టితే
నట్టనడుమ నూరకె నవ్వు నవ్వేవేమే    ॥ ఆన ॥

తెలిసి చెలులమెల్లాఁ దెరమరఁగు వేసితే
చులుకఁగాఁ బెనఁగుచు సొలసేవేమే
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనే నిన్నుఁ గూడె
చలివాయఁ బొగడితే సారె మెచ్చేవేమే   ॥ ఆన ॥

Pallavi

Ānaticcitē nēmāya nandukēmē
vūni nēmentaḍiginā nūrakuṇḍēvēmē

Charanams

1.Cakkam̐gā nīyātanisandivāvi yeṭṭidaṇṭē
cekkucētitō sigguna jendēvēmē
pikkaṭilli mī mēnula pen̄jemaṭa gārīnaṇṭē
takkaka intaṭilōnē talavan̄cēvēmē

2.Gaṭṭigā nītō nātanikatalu nēm̐ jeppam̐gānu
guṭṭutō nundānavu vūm̐konavēmē
jaṭṭigā mīmundaranu sariviḍēlu veṭṭitē
naṭṭanaḍuma nūrake navvu navvēvēmē

3.Telisi celulamellām̐ deramaram̐gu vēsitē
culukam̐gām̐ benam̐gucu solasēvēmē
yelami śrīvēṅkaṭēśum̐ ḍintalōnē ninnum̐ gūḍe
calivāyam̐ bogaḍitē sāre meccēvēmē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.