Main Menu

Andulake veragayyee Nativaro (అందులకే వెరగయ్యీ నతివరో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1308 | Keerthana 43 , Volume 23

Pallavi: Andulake veragayyee Nativaro (అందులకే వెరగయ్యీ నతివరో)
ARO: Pending
AVA: Pending

Ragam:Aribhi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందులకే వెరగయ్యీ నతివరో నిన్నుఁ జూచి
సందుకొని యాతనితో సరసములాడేవు ॥ పల్లవి ॥

మత్తిలి నీరమణునిమనసెట్టు గంటివే
కొత్తకొత్తవలపులకోడెదానవు
యిత్తల నీతఁడిప్పుడే యెట్టు గైవసమాయనే
హత్తి కడునవ్వేవు అంతలోనే నీవు    ॥ అందు ॥

కలికితనాల నెంత కాపురాలు సేసేవే
మెలకచన్నులతోడి ముద్దరాలవు
చలివాసి యంతలోనే చనపరివైతివటే
బలిమి నాతని మీరి పలికేవు నీవు    ॥ అందు ॥

రాఁపుగ శ్రీవేంకటేశు రతి నెట్టు గూడితివే
పూఁపజవ్వనముతోడి పోదికత్తెవు
యేపున నలమేల్మంగ యేమి నేరుచుకొంటివే
ఆఁపరానితమితోడ నడరేవు నీవు    ॥ అందు ॥


Pallavi

Andulakē veragayyī nativarō ninnum̐ jūci
sandukoni yātanitō sarasamulāḍēvu

Charanams

1.Mattili nīramaṇunimanaseṭṭu gaṇṭivē
kottakottavalapulakōḍedānavu
yittala nītam̐ḍippuḍē yeṭṭu gaivasamāyanē
hatti kaḍunavvēvu antalōnē nīvu

2.Kalikitanāla nenta kāpurālu sēsēvē
melakacannulatōḍi muddarālavu
calivāsi yantalōnē canaparivaitivaṭē
balimi nātani mīri palikēvu nīvu

3.Rām̐puga śrīvēṅkaṭēśu rati neṭṭu gūḍitivē
pūm̐pajavvanamutōḍi pōdikattevu
yēpuna nalamēlmaṅga yēmi nērucukoṇṭivē
ām̐parānitamitōḍa naḍarēvu nīvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.