Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1332 | Keerthana 192 , Volume 23
Pallavi: Adukone Nemtakainaa (ఆడుకొనే నెంతకైనా)
ARO: Pending
AVA: Pending
Ragam:Suddavasantham
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
ఆడుకొనే నెంతకైనా అందరితోను
వేడుక నీవు విచ్చనవిడి నుండవయ్యా ॥ పల్లవి ॥
మంతనాన నీవు నాతో మాటలాడవా యిప్పుడు
అంతోనే లేదనేవు ఆకెఁ జూచి
వంతులేక నీవొకరివాఁడవా యేమైనాను
ఇంతటిమగవాఁడవు యేల నీకు వెరపు ॥ ఆడు ॥
అండనుండి నాచే విడె మందుకొనవా నీవు
అండుకాచే వప్పటిని ఆకెఁ జూచి
బెండుపడి నీ వొకరిపెట్టుఁజెట్టవా యేమైనా
నిండుదొర వప్పటిని నీకేల వెఱపు ॥ ఆడు ॥
కలసి మెలసి నన్ను కాఁగిలించవా నీవు
ఆలికే వింతటిలోనే యాకెఁ జూచి
చెలఁగి శ్రీవేంకటేశ అలమేల్ మంగపతివి
నెలకొంటి వింతటాను నీకేల వెఱపు ॥ ఆడు ॥
Pallavi
Āḍukonē nentakainā andaritōnu
vēḍuka nīvu viccanaviḍi nuṇḍavayyā
Charanams
1.Mantanāna nīvu nātō māṭalāḍavā yippuḍu
antōnē lēdanēvu ākem̐ jūci
vantulēka nīvokarivām̐ḍavā yēmainānu
intaṭimagavām̐ḍavu yēla nīku verapu
2.Aṇḍanuṇḍi nācē viḍe mandukonavā nīvu
aṇḍukācē vappaṭini ākem̐ jūci
beṇḍupaḍi nī vokaripeṭṭum̐jeṭṭavā yēmainā
niṇḍudora vappaṭini nīkēla veṟapu
3.Kalasi melasi nannu kām̐gilin̄cavā nīvu
ālikē vintaṭilōnē yākem̐ jūci
celam̐gi śrīvēṅkaṭēśa alamēl maṅgapativi
nelakoṇṭi vintaṭānu nīkēla veṟapu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.