Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1339 | Keerthana 233 , Volume 23
Pallavi:Ainapani Kikanela (ఐనపని కికనేల)
ARO: Pending
AVA: Pending
Ragam: Vasantavarali
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
ఐనపని కిఁకనేల అనుమానము
కానిమ్మని లోనుగాక కట్టుకునేదేమీ ॥ పల్లవి ॥
మొగముచూచినదాన మొక్కవద్దా నీకు నేను
యెగసక్కెమాడఁగాను యేమాయను
నగినదాన నీతో నంటున మెప్పించవద్దా
జగడమడిచి నిన్ను సాదించేదేమి ॥ ఐన ॥
చేరఁగవచ్చినదాన సేవలు సేయఁగవద్దా
యీరసాన జంకించఁగ నేమాయను
పేరఁబిలిచినదాన ప్రియములు చెప్పవద్దా
దూరి నిన్నుఁ దిట్టుఁగాను దొరతనమేమి ॥ ఐన ॥
సిగ్గులువడినదాన చెప్పినట్లు సేయవద్దా
యెగ్గులెంచి పెనఁగఁగా నేమాయను
వెగ్గళించి నన్నిదె శ్రీవేంకటేశ కూడితివి
బగ్గన నిన్నఁగాదనేపను లిఁకనేమి ॥ ఐన ॥
Pallavi
Ainapani kim̐kanēla anumānamu
kānim’mani lōnugāka kaṭṭukunēdēmī
Charanams
1.Mogamucūcinadāna mokkavaddā nīku nēnu
yegasakkemāḍam̐gānu yēmāyanu
naginadāna nītō naṇṭuna meppin̄cavaddā
jagaḍamaḍici ninnu sādin̄cēdēmi
2.Cēram̐gavaccinadāna sēvalu sēyam̐gavaddā
yīrasāna jaṅkin̄cam̐ga nēmāyanu
pēram̐bilicinadāna priyamulu ceppavaddā
dūri ninnum̐ diṭṭum̐gānu doratanamēmi
3.Sigguluvaḍinadāna ceppinaṭlu sēyavaddā
yeggulen̄ci penam̐gam̐gā nēmāyanu
veggaḷin̄ci nannide śrīvēṅkaṭēśa kūḍitivi
baggana ninnam̐gādanēpanu lim̐kanēmi
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.