Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1499 | Keerthana 590 , Volume 24
Pallavi:Aadanunde Laagavegaa Laadavaddu (ఆడనుండే లాగవేగా లాడవద్దు)
ARO: Pending
AVA: Pending
Ragam:Bouli
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
ఆడనుండే లాగవేగా లాడవద్దు
యీడనే నీ కాఁగిలి నాకిప్పుడే యిమ్మా ॥పల్లవి॥
చెలిగట్టినచెంగావిచీర కొంగు గానవచ్చీ
మలసి నీపచ్చడము మాటునను
నెలఁత నీవద్దలేదని నిజము నెరపేవు
తెలిసె నాపానుపుమీఁదికి నీవు రమ్మా ॥ ఆడ ॥
తరుణిసొమ్ముల కాంతి తళుకున మెరిచీని
సరి నీనిలువుమేనిసందుసందుల
అరుదై యెవ్వతె దాఁచనని వొడఁబరచేవు
పరగ నిప్పుడే నాపక్కకు రమ్మా ॥ ఆడ ॥
వనితతనువువింతవాసనలు పొలసీని
నినుపుఁ జెమటగారే నీచెక్కులను
యెనసితి వేంకటేశ నేనలమేల్మంగ-
నొనర నాకెనుఁ జూపే నొద్దికతో రమ్మా ॥ ఆడ ॥
Pallavi
Āḍanuṇḍē lāgavēgā lāḍavaddu
yīḍanē nī kām̐gili nākippuḍē yim’mā
Charanams
1.Celigaṭṭinaceṅgāvicīra koṅgu gānavaccī
malasi nīpaccaḍamu māṭunanu
nelam̐ta nīvaddalēdani nijamu nerapēvu
telise nāpānupumīm̐diki nīvu ram’mā
2.Taruṇisom’mula kānti taḷukuna mericīni
sari nīniluvumēnisandusandula
arudai yevvate dām̐canani voḍam̐baracēvu
paraga nippuḍē nāpakkaku ram’mā
3.Vanitatanuvuvintavāsanalu polasīni
ninupum̐ jemaṭagārē nīcekkulanu
yenasiti vēṅkaṭēśa nēnalamēlmaṅga-
nonara nākenum̐ jūpē noddikatō ram’mā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.