Main Menu

Alara Jamchalamyna (అలర జంచలమైన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 11 | Keerthana 67 , Volume 1

Pallavi:Alara Jamchalamyna (అలర జంచలమైన)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలరఁ జంచలమైనఆత్మలందుండ నీ –
యలవాటు సేసె నీవుయ్యాల
పలుమారు నుఛ్ఛ్వాసపవనమందుండ నీ –
భావంబు దెలిపె నీవుయ్యాల     ॥ పల్లవి ॥

ఉదాయాస్త శైలంబు లొనరఁ గంభములైన –
వుడుమండలము మోఁచె నుయ్యాల
అదన నాకాశపద మడ్డదూలంబైన
అఖిలంబు నిండె నీవుయ్యాల
పదిలముగ వేదములు బంగారుచేరులై
పట్టి వెరపైతోఁచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవతపీఠమై మిగుల
వర్ణింప నరుదాయ నుయ్యాల       ॥ అల ॥

మేలుకట్లయి మీకు మేఘమండలమెల్ల
మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల
నీలశైలమువంటినీమేనికాంతికిని
నిజమైనతొడవాయె నుయ్యాల
పాలిండ్లు గదలఁగాఁ బయ్యదలు రాఁపాడ
భామినులు వడినూఁచునుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి –
నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల     ॥ అల ॥

కమలకును భూసతికి కదలుకదలుకు మిమ్ముఁ
గౌఁగలింపఁగఁజేసె నుయ్యాల
అమరాంగనలకు నీహావభావవిలాస
మందంద చూపె నీవుయ్యాల
కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై
గణుతింప నరుదాయ నుయ్యాల
కమనీయమూర్తి వేంకటశై లపతి నీకు
కడువేడుకై వుండె నుయ్యాల        ॥ అల ॥

Pallavi

alara jaMchalamainaAtmalaMduMDa nI
yalavATu sEse nIvuyyAla
palumAru nuChChvAsapavanamaMduMDa nI
bhAvaMbu delipe nIvuyyAla

Charanams

1.udayAsta SailaMbu lonara gaMbhamulaina
vuDumaMDalamu mOche nuyyAla
adana nAkASapada maDDadUlaMbaina
akhilaMbu niMDe nIvuyyAla
padilamuga vEdamulu baMgAruchErulai
paTTa verapaitOche nuyyAla
vadalakiTu dharmadEvatapIThamai migula
varNiMpa narudAya nuyyAla

2.mElukaTlayi mIku mEghamaMDalamella
me~rugunaku me~rugAya nuyyAla
nIlaSailamuvaMTinImEnikAMtikini
nijamainatoDavAya nuyyAla
pAliMDlu gadalagA bayyadalu rApADa
bhAminulu vaDinUchunuyyAla
vOli brahmAMDamulu voragunOyani bhIti
noyyanoyyana vUchi ruyyAla

3.kamalakunu bhUsatiki kadalukadaluku mimmu
gaugiliMpagajEse nuyyAla
amarAMganalaku nIhAvabhAvavilAsa
maMdaMda chUpe nIvuyyAla
kamalAsanAdulaku gannulaku paMDugai
gaNutiMpa narudAya nuyyAla
kamanIyamUrti vEMkaTaSai lapati nIku
kaDuvEDukai vuMDe nuyyAla


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.