Main Menu

Adugare Chelulaala Atanine Yeemaaata (అడుగరే చెలులాల అతనినే యీమాట)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 952 | Keerthana 298 , Volume 19

Pallavi: Adugare Chelulaala Atanine Yeemaaata (అడుగరే చెలులాల అతనినే యీమాట)
ARO: Pending
AVA: Pending

Ragam: Desakshi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals

Adugare Chelulaala Atanine | అడుగరే చెలులాల అతనినే      
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే చెలులాల అతనినే యీమాట
వుడివోనితమకాన నుండఁబోలు తాను       ॥ పల్లవి ॥

వేడుకగలప్పుడే వెస నవ్వు వచ్చుఁగాక
వాడి వున్నప్పుడు తలవంపులే కావా
యేడనో సతులచేత యేఁపులఁబడి రాఁబోలు
యీడ నేఁ జెనకఁగాను యిటులా నుండునా    ॥ అడు ॥

ఆసలఁ గూడినప్పుడే ఆయాలు గరఁగుఁగాక
పాసివున్నప్పుడు తడఁబాటులేకావా
బేసబెల్లివలపుల పిరివీకై రాఁబోలు
సేస నేఁ బెట్టఁగాను సిగ్గువడి వుండునా       ॥ అడు ॥

సరసమాడినప్పుడే చవులెల్లాఁ బుట్టుఁగాక
గొరబైనయప్పుడు కొఱతలేకావా
యిరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె మమ్ముఁ గూడె
వరుస నిందాఁకా నిటువలెఁ జొక్కకుండునా   ॥ అడు ॥

Pallavi

aDugarE chelulAla ataninE yImATa
vuDivOnitamakAna nuMDabOlu tAnu

Charanams

1.vEDukagalappudE vesa navvu vachchugAka
vADi vunnappuDU talavaMpulE kAvA
yEDanO satulachEta yEpulabaDi rAbOlu
yIDa nE jenakagAnu yiTulA nuMDunA

2.Asala gUDinappuDe AyAlu garagugAka
pAsivunnappuDu taDabATulEkAvA
bEsabellivalapula pirivIkai rAbOlu
sEsa nE beTTagAnu sigguvaDi vuMDunA

3.sarasamADinappuDE chavulellA buTTugAka
gorabainayappuDu ko~rtalEkAvA
yiravai SrIvEMkaTESu DiMtalOne mammu gUDe
varusa niMdAkA niTuvale jokkakuMdunA


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.