Main Menu

Amdukepo Yemmelamtaa (అందుకేపో యెమ్మెలంటా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1362 | Keerthana 370 , Volume 23

Pallavi: Amdukepo Yemmelamtaa (అందుకేపో యెమ్మెలంటా)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే పో యెమ్మెలంటా నాడుకొనేరు
సందడిలో గందవొడి చాతుకొనేవు   ॥ పల్లవి ॥

చేరలంతలుగన్నులచెలి నిన్నుఁ జూడఁగాను
తీరుగాఁ గస్తూరిబొట్టు తిద్దుకొనేవు
నేరుపుగలిగినావె నీవద్దనే వుండఁగాను
గారవించి వలపులకతలు చెప్పేవు   ॥ అందు ॥

కొండలంతలు గుబ్బలకొమ్మ నిన్ను నొరయఁగా
మెండుగఁ గప్పుధూళి మెత్తుకొనేవు
నిండుసింగారాన నాపె నీతో సరసమాడఁగా
అండనే తట్టుపుణుఁగు అలఁదుకొనేవు ॥ అందు ॥

పెద్దకొప్పలమేల్మంగ పేరురమపై నుండఁగా
నిద్దపుసొమ్ములు మేన నించుకొనేవు
గద్దం శ్రీవేంకటేశ కాఁగిట నాపె గూడఁగా
కొద్దిమీర నారగించి కొలువై వుండేవు  ॥ అందు ॥


Pallavi

Andukē pō yem’melaṇṭā nāḍukonēru
sandaḍilō gandavoḍi cātukonēvu

Charanams

1.Cēralantalugannulaceli ninnum̐ jūḍam̐gānu
tīrugām̐ gastūriboṭṭu tiddukonēvu
nērupugaligināve nīvaddanē vuṇḍam̐gānu
gāravin̄ci valapulakatalu ceppēvu

2.Koṇḍalantalu gubbalakom’ma ninnu norayam̐gā
meṇḍugam̐ gappudhūḷi mettukonēvu
niṇḍusiṅgārāna nāpe nītō sarasamāḍam̐gā
aṇḍanē taṭṭupuṇum̐gu alam̐dukonēvu

3.Peddakoppalamēlmaṅga pēruramapai nuṇḍam̐gā
niddapusom’mulu mēna nin̄cukonēvu
gaddaṁ śrīvēṅkaṭēśa kām̐giṭa nāpe gūḍam̐gā
koddimīra nāragin̄ci koluvai vuṇḍēvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.