Main Menu

Adiginaa Jeppadu Amgana (అడిగినా జెప్పదు అంగన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1814 | Keerthana 76 , Volume 28

Pallavi: Adiginaa Jeppadu Amgana (అడిగినా జెప్పదు అంగన)
ARO: Pending
AVA: Pending

Ragam:Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడిగినాఁ జెప్పదు అంగన తనచేఁతలు
సుడిగొనీ వలపులఁ జూడరమ్మా     ॥ పల్లవి ॥

చెక్కునఁబెట్టినచేయిచిరుఁజెమటనొసలు
చుక్కలు గాసేటి మోవి చూడరామ్మా
జక్కువ చన్నులమీఁద జారిన పయ్యెదకొంగు
చొక్కవుకళలమోము చూడరమ్మా    ॥ అడి ॥

నెరులు చెదరుఁ గొప్పు విరులు రాలేటి చొప్పు
సొరిది లేఁతనవ్వులు చూడరమ్మా
గరమతోడఁ జిట్లుగందాల ముంజేతి
సురతపు సింగారాలు చూడరమ్మ    ॥ అడి ॥

పెనఁగే హారాలు మెడ ప్రేమఁ జొక్కేఁటి తనువు
జునిఁగే శిరసు వంపు చూడరమ్మా
యెనసె శ్రీవేంకటేశుఁ డిందాఁకాఁ దను రతుల
చొనిపీ నేరుపులెల్లాఁ జూడరమ్మా    ॥ అడి ॥

Pallavi

Aḍiginām̐ jeppadu aṅgana tanacēm̐talu
suḍigonī valapulam̐ jūḍaram’mā

Charanams

1.Cekkunam̐beṭṭinacēyicirum̐jemaṭanosalu
cukkalu gāsēṭi mōvi cūḍarām’mā
jakkuva cannulamīm̐da jārina payyedakoṅgu
cokkavukaḷalamōmu cūḍaram’mā

2.Nerulu cedarum̐ goppu virulu rālēṭi coppu
soridi lēm̐tanavvulu cūḍaram’mā
garamatōḍam̐ jiṭlugandāla mun̄jēti
suratapu siṅgārālu cūḍaram’ma

3.Penam̐gē hārālu meḍa prēmam̐ jokkēm̐ṭi tanuvu
junim̐gē śirasu vampu cūḍaram’mā
yenase śrīvēṅkaṭēśum̐ ḍindām̐kām̐ danu ratula
conipī nērupulellām̐ jūḍaram’mā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.