Main Menu

Annitaa Meevaarame (అన్నిటా మీవారమే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.944 | Keerthana 248 , Volume 19

Pallavi:Annitaa Meevaarame (అన్నిటా మీవారమే)
ARO: Pending
AVA: Pending

Ragam: Gujjari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా మీ వారమే అనుమానించఁగవద్దు
యెన్నికలు సరివచ్చె నీవయ్య చనవు       ॥ పల్లవి ॥

పచ్చిసేసేదాననా బాఁతితోడ నీవలపు
తచ్చి తచ్చి దాఁచుకొనేదానఁగాక
మచ్చములుగ నేనంటా మరి నాకేల లోఁగేవు
రచ్చవేయఁ జేఁత లిట్టె రావయ్య నావద్దకి     ॥ అన్ని ॥

నవ్వేటిదాననా ననిచి నీసుద్దులెల్లా
దవ్వుల వంకలుదిద్దేదానఁ గాక
యెవ్వరు నెరఁగకుండా నేకాంతమేలాడేవు
వువ్విళ్లూరఁ గాఁతాళించ నుండవయ్య యీడను ॥ అన్ని ॥

సిగ్గువరచేదాననా చేరి నీకాఁగిటఁ గూడి
తగ్గనిరతుల మెచ్చేదానఁ గాక
నిగ్గుల శ్రీవేంకటేశ నీవేల వేఁడుకొనేవు
యెగ్గుపట్ట నన్ను నిట్టె యేలవయ్య యిపుడు   ॥ అన్ని ॥

Pallavi

Anniṭā mī vāramē anumānin̄cam̐gavaddu
yennikalu sarivacce nīvayya canavu

Charanams

1.Paccisēsēdānanā bām̐titōḍa nīvalapu
tacci tacci dām̐cukonēdānam̐gāka
maccamuluga nēnaṇṭā mari nākēla lōm̐gēvu
raccavēyam̐ jēm̐ta liṭṭe rāvayya nāvaddaki

2.Navvēṭidānanā nanici nīsuddulellā
davvula vaṅkaludiddēdānam̐ gāka
yevvaru neram̐gakuṇḍā nēkāntamēlāḍēvu
vuvviḷlūram̐ gām̐tāḷin̄ca nuṇḍavayya yīḍanu

3.Sigguvaracēdānanā cēri nīkām̐giṭam̐ gūḍi
tagganiratula meccēdānam̐ gāka
niggula śrīvēṅkaṭēśa nīvēla vēm̐ḍukonēvu
yeggupaṭṭa nannu niṭṭe yēlavayya yipuḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.