Main Menu

Amtachakkanivaadavu Annitaa (అంతచక్కనివాడవు అన్నిటా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1826 | Keerthana 146 , Volume 28

Pallavi:Amtachakkanivaadavu Annitaa (అంతచక్కనివాడవు అన్నిటా)
ARO: Pending
AVA: Pending

Ragam: Salangam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత చక్కనివాఁడవు అన్నిటా జాణవు నీవు
సంతోసాన నుప్పంగీ సారెకు నా మనసు   ॥ పల్లవి ॥

పొలసి నిన్నొకమారు పూఁచి తప్పక చూచితే
వలవక వుండుదురా వనితలు
నిలువున నెప్పుడైనా నీరూపు దలఁచుకొంటే
వులివచ్చి చెమటల నోలలాడకుందురా   ॥ అంత ॥

సముకాన నీతోను సంగాతాను సేసితే
తమకించకుండుదురా తరుణులు
జమళి మేనులు సోఁక సరసము లాడితేను
మమతల నిన్ను నిట్టె మరుగక వుండుదురా ॥ అంత ॥

యాడుజోడై నిన్నుఁ గూడి యెడవాయ కుండితే
వేడుకఁ జొక్కకుందురా వెలఁదులు
యాడనె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యేడవారూ నీపొందుల కేఁకరకవుందురా   ॥ అంత ॥

Pallavi

Anta cakkanivām̐ḍavu anniṭā jāṇavu nīvu
santōsāna nuppaṅgī sāreku nā manasu

Charanams

1.Polasi ninnokamāru pūm̐ci tappaka cūcitē
valavaka vuṇḍudurā vanitalu
niluvuna neppuḍainā nīrūpu dalam̐cukoṇṭē
vulivacci cemaṭala nōlalāḍakundurā

2.Samukāna nītōnu saṅgātānu sēsitē
tamakin̄cakuṇḍudurā taruṇulu
jamaḷi mēnulu sōm̐ka sarasamu lāḍitēnu
mamatala ninnu niṭṭe marugaka vuṇḍudurā

3.Yāḍujōḍai ninnum̐ gūḍi yeḍavāya kuṇḍitē
vēḍukam̐ jokkakundurā velam̐dulu
yāḍane śrīvēṅkaṭēśa yēlitivi nannu niṭṭe
yēḍavārū nīpondula kēm̐karakavundurā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.