Main Menu

Andukugaa Cheli Navvi (అందుకుఁగా చెలి నవ్వి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1089 | Keerthana 534 , Volume 20

Pallavi: Andukugaa Cheli Navvi (అందుకుఁగా చెలి నవ్వి)
ARO: Pending
AVA: Pending

Ragam:Malavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకుఁగా చెలి నవ్వి అంగమెల్లాఁ జెమరించె
సందడి జాణతనాల సరసుఁడ వవుదువు ॥ పల్లవి ॥

తెప్పమీఁద నుండి నీవు దిక్కులు చూడఁగాను
అప్పుడు తామెరఁ గొని అతివ వేసె
తప్పువట్టి యంతలోనే తాకెనంటా నీమేను
రెప్పలెత్తి చూచేవు రేసు లిఁకనేఁటికి    ॥ అందు ॥

పంతముతో జలకేలిఁ బరాకై వుండగాను
అంతలో జలము చల్లె అంగన నిన్ను
వంతుకుఁ దిట్టేవు నీవన్నె దొప్పఁదోఁగెనంటా
యెంత బొమ్మల జంకించే వెగసక్కేలేఁటికి॥ అందు ॥

చంచుల గోనేటిలోన చల్లగా నీవు దేలఁగా
మించి కాగిలించె నలమేలుమంగ
ముంచి శ్రీవేంకటేశుఁడ మొక్కేవు బిగించెనంటా
పొంచి సరివెనఁగేవు బూటకము లేఁటికి  ॥ అందు ॥


Pallavi

Andukum̐gā celi navvi aṅgamellām̐ jemarin̄ce
sandaḍi jāṇatanāla sarasum̐ḍa vavuduvu

Charanams

1.Teppamīm̐da nuṇḍi nīvu dikkulu cūḍam̐gānu
appuḍu tāmeram̐ goni ativa vēse
tappuvaṭṭi yantalōnē tākenaṇṭā nīmēnu
reppaletti cūcēvu rēsu lim̐kanēm̐ṭiki

2.Pantamutō jalakēlim̐ barākai vuṇḍagānu
antalō jalamu calle aṅgana ninnu
vantukum̐ diṭṭēvu nīvanne doppam̐dōm̐genaṇṭā
yenta bom’mala jaṅkin̄cē vegasakkēlēm̐ṭiki

3.Can̄cula gōnēṭilōna callagā nīvu dēlam̐gā
min̄ci kāgilin̄ce nalamēlumaṅga
mun̄ci śrīvēṅkaṭēśum̐ḍa mokkēvu bigin̄cenaṇṭā
pon̄ci sarivenam̐gēvu būṭakamu lēm̐ṭiki


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.