Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No.1834 | Keerthana 196 , Volume 28
Pallavi: Annitaa Jaanavaiti (అన్నిటా జాణవైతి)
ARO: Pending
AVA: Pending
Ragam: Hijjiji
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అన్నిటా జాణవైతి వప్పుడే నీవు
యెన్నేసి చేఁతలు సే సే విసుమంతదానవు ॥ పల్లవి ॥
మాటలా డనేరుతువే మగనితో సారెసారె
వీటుచూపనేరుతువే నిలుచుండి
గూఁటముగా నిన్నుఁ జూచి కడువెరగయ్యా నాకు
యీటుతో రట్టడివైతి విసుమంతదానవు ॥ అన్ని॥
చెనకంగనేరుతువే చేతులారా నీవిభుని
వినయాలు నేరుతువే వేవేలుగాను
ఘనముగా నవ్వే నీవు కత గరచినందుకు
యెన సెంత జూటవైతి విసుమంతదానవు ॥ అన్ని॥
చేరి మొక్కనేరుతువే శ్రీవేంకటేశ్వరునికి
కూరిమితోఁ గాంగిలించి కూడనేర్తువే
యారీతి నన్నితఁ డేలె యిందుకే నాకరుదయ్యా
యేరుపరచకువే నీ విసుమంతదానవు ॥ అన్ని॥
Pallavi
Anniṭā jāṇavaiti vappuḍē nīvu
yennēsi cēm̐talu sē sē visumantadānavu
Charanams
1.Māṭalā ḍanērutuvē maganitō sāresāre
vīṭucūpanērutuvē nilucuṇḍi
gūm̐ṭamugā ninnum̐ jūci kaḍuveragayyā nāku
yīṭutō raṭṭaḍivaiti visumantadānavu
2.Cenakaṅganērutuvē cētulārā nīvibhuni
vinayālu nērutuvē vēvēlugānu
ghanamugā navvē nīvu kata garacinanduku
yena senta jūṭavaiti visumantadānavu
3.Cēri mokkanērutuvē śrīvēṅkaṭēśvaruniki
kūrimitōm̐ gāṅgilin̄ci kūḍanērtuvē
yārīti nannitam̐ ḍēle yindukē nākarudayyā
yēruparacakuvē nī visumantadānavu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.