Main Menu

Antalone Navvunavve (అంతలోనే నవ్వునవ్వే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1093 | Keerthana 551 , Volume 20

Pallavi:Antalone Navvunavve (అంతలోనే నవ్వునవ్వే)
ARO: Pending
AVA: Pending

Ragam: Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతలోనే నవ్వునవ్వే వౌనే నీవు
అంతరంగమెల్ల నిండ ఆతఁడు గదే    ॥ పల్లవి ॥

చిన్నఁబోయి వుండినది చెలియ నీమోమిదేమే
చెన్నగునీవిభుఁడు విచ్చేయఁడాయనా
వెన్నెలలోపల నుండి వేసవియెండ లనేవు
అన్నమాటలోనే వచ్చె నాతఁడుగదే    ॥ అంత ॥

నొసలెల్లాఁ జెమరించి నున్ననిచెక్కులఁ జారె
అసురుసురుగ నీతఁ డలయించెనా
పసురు మొగ్గలు చూచి పంచబాణము లనేవు
అసమునఁ జేయిచాఁచీ నాతఁడుగదే    ॥ అంత ॥

కాయమెల్లఁ బులకించి కళలునిండె నిప్పుడు
యీయెడ శ్రీవేంకటేశుఁ డిట్టె కూడెనా
రేయిఁబగలాయనని రెట్టించె వలపనేవు
ఆయములిన్నీఁ దెలిపె నాతఁడుగదే    ॥ అంత ॥

Pallavi

Antalōnē navvunavvē vaunē nīvu
antaraṅgamella niṇḍa ātam̐ḍu gadē

Charanams

1.Cinnam̐bōyi vuṇḍinadi celiya nīmōmidēmē
cennagunīvibhum̐ḍu viccēyam̐ḍāyanā
vennelalōpala nuṇḍi vēsaviyeṇḍa lanēvu
annamāṭalōnē vacce nātam̐ḍugadē

2.Nosalellām̐ jemarin̄ci nunnanicekkulam̐ jāre
asurusuruga nītam̐ ḍalayin̄cenā
pasuru moggalu cūci pan̄cabāṇamu lanēvu
asamunam̐ jēyicām̐cī nātam̐ḍugadē

3.Kāyamellam̐ bulakin̄ci kaḷaluniṇḍe nippuḍu
yīyeḍa śrīvēṅkaṭēśum̐ ḍiṭṭe kūḍenā
rēyim̐bagalāyanani reṭṭin̄ce valapanēvu
āyamulinnīm̐ delipe nātam̐ḍugadē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.