Main Menu

Aaduvaari Gantejaalu Aasa (ఆఁడువారిఁ గంటేఁజాలు ఆస)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1839 | Keerthana 224 , Volume 28

Pallavi:Aaduvaari Gantejaalu Aasa (ఆఁడువారిఁ గంటేఁజాలు ఆస)
ARO: Pending
AVA: Pending

Ragam:Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆఁడువారిఁ గంటేఁజాలు ఆస నీకెంతైనాఁ గద్దు
పోడిమితోఁ మమ్మంటేవు పొద్దువోదా నీకు     ॥ పల్లవి ॥

యెచ్చిన తమకముతో నెదురులు చూచుకొంటా
కచ్చు పెంటి నీకు నాపె గాచుకున్నది
మచ్చికజాణతనాలు మాతో నేమి యాడేవు
అచ్చముగా మాతోపొందు లంతేసి కోపుదువా    ॥ ఆఁడు ॥

కందువ నిన్నుఁ బెండ్లాడి కాఁపురము సే సేనంటా
పొందులకు నీతో నాపె వూఁచుకున్నది
చెంది మా చన్నులమీఁద చేతులేమి చాఁచేవు
అందముగ మాతో పొందు లంతేసి కోపుదువా   ॥ ఆఁడు ॥

వేడుక నలమేల్మంగవిభుఁడు శ్రీవేంకటేశ
కూడేనంటా నాపె నిన్నుఁ గోరుకున్నది
వాడికగా మమ్ము నీడ వలపించి యేలితివి
ఆడుకోలు మాతోపొందు లంతేసి కోపుదువా    ॥ ఆఁడు ॥

Pallavi

Ām̐ḍuvārim̐ gaṇṭēm̐jālu āsa nīkentainām̐ gaddu
pōḍimitōm̐ mam’maṇṭēvu podduvōdā nīku

Charanams

1.Yeccina tamakamutō nedurulu cūcukoṇṭā
kaccu peṇṭi nīku nāpe gācukunnadi
maccikajāṇatanālu mātō nēmi yāḍēvu
accamugā mātōpondu lantēsi kōpuduvā

2.Kanduva ninnum̐ beṇḍlāḍi kām̐puramu sē sēnaṇṭā
pondulaku nītō nāpe vūm̐cukunnadi
cendi mā cannulamīm̐da cētulēmi cām̐cēvu
andamuga mātō pondu lantēsi kōpuduvā

3.Vēḍuka nalamēlmaṅgavibhum̐ḍu śrīvēṅkaṭēśa
kūḍēnaṇṭā nāpe ninnum̐ gōrukunnadi
vāḍikagā mam’mu nīḍa valapin̄ci yēlitivi
āḍukōlu mātōpondu lantēsi kōpuduvā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.