Main Menu

Agajesu Na Chupulatu (ఆగజేసు నా చూపులటు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 7 | Keerthana 40 , Volume 5

Pallavi:Agajesu Na Chupulatu (ఆగజేసు నా చూపులటు)
ARO: Pending
AVA: Pending

Ragam:Varaali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆఁగఁ జేసు నా చూపులటు వోవయ్య
మూఁగిన నా వలపుల మూలకు రానేలా      ॥ పల్లవి ॥

ఇమ్ముల నొల్లని వారమేల నీకు నామేని-
అమ్ముల పులకలొత్తీ నటు వోవయ్య
కమ్మవిలుతునిచేతఁ గాఁగెడి నన్నొరసేవు
నెమ్మది నుండి యుండి నీకు నొవ్వనేలా     ॥ ఆఁగ ॥

ఇతవు గాని వారమేల నీకు నామేని-
ఆతితాపమంటుఁ జేసు నటు వోవయ్య
రతిరాజుచేత నారడిఁబడ్డ ననుఁ జేరి
జతనాన వుండివుండి జాలిఁబొంద నేల     ॥ ఆఁగ ॥

ఇంతటి నీ కౌగిటికి నేల నేము మాకోప-
మంతరమెఱఁగనేరదటు వోవయ్య
పంతగాఁడ వెంకటపతి నీవు ననుఁ గూడి
చింతతోడఁ బొరలుచు సిలుగంద నేలా     ॥ ఆఁగ ॥

Pallavi

Ām̐gam̐ jēsu nā cūpulaṭu vōvayya
mūm̐gina nā valapula mūlaku rānēlā

Charanams

1.Im’mula nollani vāramēla nīku nāmēni-
am’mula pulakalottī naṭu vōvayya
kam’mavilutunicētam̐ gām̐geḍi nannorasēvu
nem’madi nuṇḍi yuṇḍi nīku novvanēlā

2.Itavu gāni vāramēla nīku nāmēni-
ātitāpamaṇṭum̐ jēsu naṭu vōvayya
ratirājucēta nāraḍim̐baḍḍa nanum̐ jēri
jatanāna vuṇḍivuṇḍi jālim̐bonda nēla

3.Intaṭi nī kaugiṭiki nēla nēmu mākōpa-
mantarameṟam̐ganēradaṭu vōvayya
pantagām̐ḍa veṅkaṭapati nīvu nanum̐ gūḍi
cintatōḍam̐ boralucu siluganda nēlā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.