Main Menu

Adanumdi Vachchi Naaku (ఆడనుండి వచ్చి నాకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1753 | Keerthana 317, Volume 27

Pallavi:Adanumdi Vachchi Naaku (ఆడనుండి వచ్చి నాకు)
ARO: Pending
AVA: Pending

Ragam: Amara Sindhu
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడనుండి వచ్చి నాకు ఆసపడేవు
జోడుకూడి నిన్ను రతిఁ జొక్కించదాయనా    ॥ పల్లవి ॥

పైపై నన్నుఁ జెనకేవు పాఁచి మేనితో వచ్చి
ఆపె వోపనప్పుడెల్లా నడ్డమా నేను
కోపము గాదుగా గొబ్బన నిన్నడిగితి
ఆ పాటి నిన్నుఁ దనివి నందించదాయనా    ॥ ఆడ ॥

పట్టి విడె మడిగేవు పరఁగడుపునవచ్చి
వొట్టి యాపె వూడిగాల కూరటా నేను
దిట్టతనమున నిన్నుఁ దెలియవలసి యింతె
బెట్టుగఁ దమ్ములమైనాఁ బెట్టదాయనా       ॥ ఆడ ॥

వంచి నామోము చూచేవు వరవాత లేచివచ్చి
అంచెనాచేఁతను చూడ నడ్డమా నేను
కొంచక శ్రీ వేంకటేశ కూడితివి నన్ను నీకు
మంచి మొగాలవారి నెమ్మదిఁ జూపదాయనా    ॥ ఆడ ॥

Pallavi

Āḍanuṇḍi vacci nāku āsapaḍēvu
jōḍukūḍi ninnu ratim̐ jokkin̄cadāyanā

Charanams

1.Paipai nannum̐ jenakēvu pām̐ci mēnitō vacci
āpe vōpanappuḍellā naḍḍamā nēnu
kōpamu gādugā gobbana ninnaḍigiti
ā pāṭi ninnum̐ danivi nandin̄cadāyanā

2.Paṭṭi viḍe maḍigēvu param̐gaḍupunavacci
voṭṭi yāpe vūḍigāla kūraṭā nēnu
diṭṭatanamuna ninnum̐ deliyavalasi yinte
beṭṭugam̐ dam’mulamainām̐ beṭṭadāyanā

3.Van̄ci nāmōmu cūcēvu varavāta lēcivacci
an̄cenācēm̐tanu cūḍa naḍḍamā nēnu
kon̄caka śrī vēṅkaṭēśa kūḍitivi nannu nīku
man̄ci mogālavāri nem’madim̐ jūpadāyanā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.