Main Menu

Amdari Meppimchudaakaa Sanage (అందరి మెప్పించుదాకా సణగే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 993 | Keerthana 544 , Volume 19

Pallavi: Amdari Meppimchudaakaa Sanage (అందరి మెప్పించుదాకా సణగే)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరి మెప్పించుదాఁకా నణఁగేఁగాక । నే-
నిందులోనే పాలు నీరు నేరుపరచలేనా    ॥ పల్లవి ॥

ఇంకాఁ దానే యెరిఁగీని ఇప్పుడేలంటాఁగాక
అంకెలం బదరనైతి నయ్యా నేను
వంకలొత్తి నేఁ దనవంటిదాననై తేఁ గన
లంకెలమీతోఁ దనలాగులెల్లఁ జెప్పనా    ॥అంద॥

ఇప్పటి కోపము మీఁద నిట్టే వుండదని కాక
కప్పుడు నాచేఁతలెల్లఁ గంటే నేను
తప్పని నాగుణములు తనగుణములఁ బోలితే
బొప్పుతో నక్కునఁబోసి చూపనా మీకు    ॥అంద॥

పోరానిచుట్టరికపు పొందు దనదని కాక
చేరి నోరు మూసుకొంటి చెల్లఁబో నేను
ఆరీతి శ్రీ వేంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
తారుకాణ లిఁక నేల తానే నేను       ॥అంద॥


Pallavi

Andari meppin̄cudām̐kā naṇam̐gēm̐gāka। nē-
nindulōnē pālu nīru nēruparacalēnā

Charanams

1.Iṅkām̐ dānē yerim̐gīni ippuḍēlaṇṭām̐gāka
aṅkelaṁ badaranaiti nayyā nēnu
vaṅkalotti nēm̐ danavaṇṭidānanai tēm̐ gana
laṅkelamītōm̐ danalāgulellam̐ jeppanā

2.Ippaṭi kōpamu mīm̐da niṭṭē vuṇḍadani kāka
kappuḍu nācēm̐talellam̐ gaṇṭē nēnu
tappani nāguṇamulu tanaguṇamulam̐ bōlitē
bopputō nakkunam̐bōsi cūpanā mīku

3.Pōrānicuṭṭarikapu pondu danadani kāka
cēri nōru mūsukoṇṭi cellam̐bō nēnu
ārīti śrī vēṅkaṭēśum̐ ḍantalōne nannum̐ gūḍe
tārukāṇa lim̐ka nēla tānē nēnu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.