Main Menu

Addamulo Joochukove Alamelmamgaa (అద్దములో జూచుకోవే అలమేల్మంగా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1998 | Keerthana 527 , Volume 29

Pallavi: Addamulo Joochukove Alamelmamgaa (అద్దములో జూచుకోవే అలమేల్మంగా)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అద్దములోఁ జూచుకోవే అలమేల్మంగా
నిద్దపు సింగారాలు నీకే కానవచ్చీని     ॥ పల్లవి ॥

మొలక చన్నులమీఁది ముద్దు చంద్రవంకలు
తళుకుఁ జెక్కులమీఁది తమలంపు టంట్లు
నిలువుఁ దురుముమీఁది నెయ్యపుఁ జేపట్లు
బయలు నీ వలపెల్లాఁ బచ్చిసెసెఁగదవే   ॥ అద్ద ॥

చిగురుమోవిమీఁది చిన్ని చిన్ని కెంపులు
జిగిమించు నొసలిపై చిరుత చెమటలు
మొగములో వసివాడు ముసి ముసి నవ్వులు
పగటు నీ వలపులు పచ్చిసేసెఁగదవే   ॥ అద్ద ॥

చక్కని నీ మేనిమీఁది జవ్వాది కరఁగులు
మొక్కలపు కుచ్చులపై మొలనూలి జారులు
వెక్కసపు కాఁగిట శ్రీవేంకటేశు కూటములు
పక్కన నీ వలపులు పచ్చిసేసెఁగదవే   ॥ అద్ద ॥

Pallavi

Addamulōm̐ jūcukōvē alamēlmaṅgā
niddapu siṅgārālu nīkē kānavaccīni

Charanams

1.Molaka cannulamīm̐di muddu candravaṅkalu
taḷukum̐ jekkulamīm̐di tamalampu ṭaṇṭlu
niluvum̐ durumumīm̐di neyyapum̐ jēpaṭlu
bayalu nī valapellām̐ baccisesem̐gadavē

2.Cigurumōvimīm̐di cinni cinni kempulu
jigimin̄cu nosalipai ciruta cemaṭalu
mogamulō vasivāḍu musi musi navvulu
pagaṭu nī valapulu paccisēsem̐gadavē

3.Cakkani nī mēnimīm̐di javvādi karam̐gulu
mokkalapu kucculapai molanūli jārulu
vekkasapu kām̐giṭa śrīvēṅkaṭēśu kūṭamulu
pakkana nī valapulu paccisēsem̐gadavē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.