Main Menu

Aalimagani Jaadalu Amdariki (ఆలిమగని జాడలు అందరికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1850 | Keerthana 290 , Volume 28

Pallavi: Aalimagani Jaadalu Amdariki (ఆలిమగని జాడలు అందరికి)
ARO: Pending
AVA: Pending

Ragam:Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆలిమగని జాడలు అందరికి నివియే
మేలుమీఁదుగా విభుని మెప్పించవే నీవు    ॥ పల్లవి ॥

వింత లేక మెలఁగితే వేడుక నెరపవలె
సంతోసించితేను మెచ్చఁగవలెను
మంతనానకు లోనైతే మరిగియుండఁగవలె
పంతము లాడఁగరాదు పతితోడఁ జెలికి     ॥ ఆలి ॥

ననుపు గలిగితేను నవ్వులు నవ్వఁగవలె
మనసు లెనసితే సమ్మతించవలె
వినయాలు నేరిచితే వేమారు వేఁడుకోవలె
పెనఁగులాడఁగరాదు ప్రియునితో సతికి    ॥ ఆలి ॥

వావు లేకములైతే వడిఁ బొందుసేయవలె
దేవులైతేఁ దనబత్తి దెలుపవలె
శ్రీవేంకటేశుఁ డేలితే సిగ్గులు మానఁగవలె
కావరించి మీరరాదు కాంతునితో నింతికి    ॥ ఆలి ॥

Pallavi

Ālimagani jāḍalu andariki niviyē
mēlumīm̐dugā vibhuni meppin̄cavē nīvu

Charanams

1.Vinta lēka melam̐gitē vēḍuka nerapavale
santōsin̄citēnu meccam̐gavalenu
mantanānaku lōnaitē marigiyuṇḍam̐gavale
pantamu lāḍam̐garādu patitōḍam̐ jeliki

2.Nanupu galigitēnu navvulu navvam̐gavale
manasu lenasitē sam’matin̄cavale
vinayālu nēricitē vēmāru vēm̐ḍukōvale
penam̐gulāḍam̐garādu priyunitō satiki

3.Vāvu lēkamulaitē vaḍim̐ bondusēyavale
dēvulaitēm̐ danabatti delupavale
śrīvēṅkaṭēśum̐ ḍēlitē siggulu mānam̐gavale
kāvarin̄ci mīrarādu kāntunitō nintiki


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.