Main Menu

Alamelmamgavu Neevu Akkuna (అలమేల్మంగవు నీవు అక్కున)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1856 | Keerthana 324 , Volume 28

Pallavi: Alamelmamgavu Neevu Akkuna (అలమేల్మంగవు నీవు అక్కున)
ARO: Pending
AVA: Pending

Ragam: Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలమేల్మంగవు నీవు అక్కున నుందానవు
లలి నీగుణమెఱిఁగి లాలించీఁ గాక      ॥ పల్లవి ॥

కొచ్చి కొచ్చి పలుమారుఁ గొసర నేమిటికే
మచ్చికతో నాతఁడే మన్నించీఁగాక
కచ్చుపెట్టి రతులకుఁ గక్కసించనేఁటికే
యిచ్చకము సేయఁగానే యెనసీఁగాక     ॥ అల ॥

విన్నపాలు నేసి సేసి వేసిరించనేఁటికే
తన్నుఁదానే నీపై దయదలఁచీఁగాక
చన్నుఁ గొండలనే వొత్తి చండిసేయ నేఁటికే
యెన్నికతో వేఁడుకొంటే నియ్య కొనీఁగాక    ॥ అల ॥

పిక్కటిల్లఁ జేయివట్టి పెనఁగఁగ నేఁటికే
యిక్కడ శ్రీవేంకటేశుఁ డేలీఁగాక
తక్క నిన్నుఁ బెండ్లాడీ తమకించ నేఁటికే
చక్కఁగా సేవ చేసితే చనవిచ్చీఁగాక     ॥ అల ॥

Pallavi

Alamēlmaṅgavu nīvu akkuna nundānavu
lali nīguṇameṟim̐gi lālin̄cīm̐ gāka

Charanams

1.Kocci kocci palumārum̐ gosara nēmiṭikē
maccikatō nātam̐ḍē mannin̄cīm̐gāka
kaccupeṭṭi ratulakum̐ gakkasin̄canēm̐ṭikē
yiccakamu sēyam̐gānē yenasīm̐gāka

2.Vinnapālu nēsi sēsi vēsirin̄canēm̐ṭikē
tannum̐dānē nīpai dayadalam̐cīm̐gāka
cannum̐ goṇḍalanē votti caṇḍisēya nēm̐ṭikē
yennikatō vēm̐ḍukoṇṭē niyya konīm̐gāka

3.Pikkaṭillam̐ jēyivaṭṭi penam̐gam̐ga nēm̐ṭikē
yikkaḍa śrīvēṅkaṭēśum̐ ḍēlīm̐gāka
takka ninnum̐ beṇḍlāḍī tamakin̄ca nēm̐ṭikē
cakkam̐gā sēva cēsitē canaviccīm̐gāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.