Main Menu

Alameelu Mamgapativani (అలమేలు మంగపతివని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1856 | Keerthana 328 , Volume 28

Pallavi: Alameelu Mamgapativani (అలమేలు మంగపతివని)
ARO: Pending
AVA: Pending

Ragam:Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలమేలుమంగపతివని నిన్నెఱఁగదేమో
కలికి చేఁతలు నీకు గంపల నమ్మీని    ॥ పల్లవి ॥

నెరవాది తనమెంతో నీవెదుట నుండఁగా
తరుణి సిగ్గులనే దడి గట్టీని
గరిమలఁ దా నెన్ని కతలఁ గరచెనో
పెరరేఁచి వినయాలు పేరఁ బెట్టీని      ॥ అల ॥

కచ్చుక యెన్నాళ్లనుండి కాచుకుండెనో నీతో
తచ్చన మాఁటలనే దండగట్టీని
బచ్చెన వేసాలు నెంత పరగినదో కాని
పచ్చి నవ్వులనే తలఁబాలు వోసీని     ॥ అల ॥

తారుకొణగా నిన్నెంత దక్కఁగినుకొన్నదో
సారె సారె వలపుల జాజరాడీని
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
కూరిమిఁ దానూఁ గొంత కొసరి లాచీని   ॥ అల ॥

Pallavi

Alamēlumaṅgapativani ninneṟam̐gadēmō
kaliki cēm̐talu nīku gampala nam’mīni

Charanams

1.Neravādi tanamentō nīveduṭa nuṇḍam̐gā
taruṇi siggulanē daḍi gaṭṭīni
garimalam̐ dā nenni katalam̐ garacenō
perarēm̐ci vinayālu pēram̐ beṭṭīni

2.Kaccuka yennāḷlanuṇḍi kācukuṇḍenō nītō
taccana mām̐ṭalanē daṇḍagaṭṭīni
baccena vēsālu nenta paraginadō kāni
pacci navvulanē talam̐bālu vōsīni

3.Tārukoṇagā ninnenta dakkam̐ginukonnadō
sāre sāre valapula jājarāḍīni
yīrīti śrīvēṅkaṭēśa yēlitivi nannu nēm̐ḍu
kūrimim̐ dānūm̐ gonta kosari lācīni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.