Main Menu

Adu Janmame Melu (ఆడు జన్మమే మేలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1767 | Keerthana 399 , Volume 27

Pallavi:Adu Janmame Melu (ఆడు జన్మమే మేలు)
ARO: Pending
AVA: Pending

Ragam:Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆఁడు జన్మమే మేలు అందరికిని
పోఁడిమితో నీవంటి పురుషుఁ డుండఁగను   ॥ పల్లవి ॥

గోపికల కొరకె కొండ గొడ గెత్తితివి
గోపికల కొరకె గోవులనుఁ గాచితివి
యీపాటి వాఁడవు ఇంతులఁ గంటేఁ జాలు
యేపనియైనాఁ జేతువు యెరిఁగితిమయ్య    ॥ ఆఁడు ॥

పొంచి సత్యభామకుఁగా పువ్వులమాఁకు మోఁచితి
పొంచి సత్యభామవద్ద పోటుబంటవై మించితి
ఇంచుకంతా లోఁగవు ఇంతు లొద్దనుంటేఁ జాలు
యెంచ కన్నియుఁ జేతువు యెరిఁగితిమయ్య  ॥ ఆఁడు ॥

మిన్ను సాదించి తెచ్చితి మెరసి పదారువేల
మిన్నునేలఁ గూడపెట్టి మించి రుక్మిణిఁ జేకొంటి
ఇన్నిటా శ్రీ వేంకటేశ ఇరవైతివి మాపాల
యెన్నియైనాఁ జేతువు నిన్నెరిఁగితిమయ్యా  ॥ ఆఁడు ॥

Pallavi

Ām̐ḍu janmamē mēlu andarikini
pōm̐ḍimitō nīvaṇṭi puruṣum̐ ḍuṇḍam̐ganu

Charanams

1.Gōpikala korake koṇḍa goḍa gettitivi
gōpikala korake gōvulanum̐ gācitivi
yīpāṭi vām̐ḍavu intulam̐ gaṇṭēm̐ jālu
yēpaniyainām̐ jētuvu yerim̐gitimayya

2.Pon̄ci satyabhāmakum̐gā puvvulamām̐ku mōm̐citi
pon̄ci satyabhāmavadda pōṭubaṇṭavai min̄citi
in̄cukantā lōm̐gavu intu loddanuṇṭēm̐ jālu
yen̄ca kanniyum̐ jētuvu yerim̐gitimayya

3.Minnu sādin̄ci tecciti merasi padāruvēla
minnunēlam̐ gūḍapeṭṭi min̄ci rukmiṇim̐ jēkoṇṭi
inniṭā śrī vēṅkaṭēśa iravaitivi māpāla
yenniyainām̐ jētuvu ninnerim̐gitimayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.