Main Menu

Ani Venkatesu Daade (అని వేంకటేశుఁ డాడె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1870 | Keerthana 411 , Volume 28

Pallavi: Ani Venkatesu Daade (అని వేంకటేశుఁ డాడె)
ARO: Pending
AVA: Pending

Ragam:Salanga nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అని వేంకటేశుఁ డాడె నలమేలుమంగతోడ
వినరే వో చెలులా వేమారు నీరీతుల      ॥ పల్లవి ॥

తప్పక చూచితే నేమే తరగీనా నీ పంతము
కప్పనేలే నీ చన్నులు గరివడీనా
చెప్పవే నీపేరు మోవి చిల్లులువో నింతలోనే
యిప్పడు నన్నింతసేసి యేమిగట్టుకొనేవే    ॥ అని ॥

వద్దఁ గూచుండితే నేమే వాసి ముక్కవోయీనా
గద్డించే వింతలోఁ గండ గట్టుకొంటివా
పొద్దువోదు నవ్వఁగదే పోదు నీ బీరమెంతైనా
యిద్దెస నన్నింతసేసి యేమి గట్టుకొనేవే    ॥ అని ॥

సేవలు సేసితే నేమే సిగ్గులు నీకు ముంచీనా
దేవులవైతివి వావి తిరమాయను
నీ వలమేలుమంగవు నేను శ్రీవేంకటేశుఁడ
యీవల నన్నింతసేసి యేమి గట్టుకొనేవే    ॥అని॥

Pallavi

Ani vēṅkaṭēśum̐ ḍāḍe nalamēlumaṅgatōḍa
vinarē vō celulā vēmāru nīrītula

Charanams

1.Tappaka cūcitē nēmē taragīnā nī pantamu
kappanēlē nī cannulu garivaḍīnā
ceppavē nīpēru mōvi cilluluvō nintalōnē
yippaḍu nannintasēsi yēmigaṭṭukonēvē

2.Vaddam̐ gūcuṇḍitē nēmē vāsi mukkavōyīnā
gad’ḍin̄cē vintalōm̐ gaṇḍa gaṭṭukoṇṭivā
podduvōdu navvam̐gadē pōdu nī bīramentainā
yiddesa nannintasēsi yēmi gaṭṭukonēvē

3.Sēvalu sēsitē nēmē siggulu nīku mun̄cīnā
dēvulavaitivi vāvi tiramāyanu
nī valamēlumaṅgavu nēnu śrīvēṅkaṭēśum̐ḍa
yīvala nannintasēsi yēmi gaṭṭukonēvē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.