Main Menu

Andulake Veragayyee (అందులకె వెరగయ్యీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1872 | Keerthana 420 , Volume 28

Pallavi: Andulake Veragayyee (అందులకె వెరగయ్యీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Telugu kambhodhi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందులకే వెరగయ్యీ నప్పటనుండి నాకు
కందువ నెన్నాళ్లనుండి కాచుకవున్నదియో ॥ పల్లవి ॥

కొత్త కొత్త మాఁట లాడీ కొమలి నీ తోడుత
యిత్తల వావిని నీకు నీమౌనోకాని
హత్తి కొలువులు సేసీ నప్పటి వేడుకతోడ
బత్తి నీపై నెంతగద్దో భావించితేఁ దనకు    ॥ అందు ॥

సొలసి సొలసి నిన్నుఁ జూచీని పలుమారు
పొలుపుగ నేనాఁటిపొందుగాని
చెలరేఁగి సేయరాని సేవలెల్లాఁ జేసీ నీకు
కొలఁదిమీర నిన్నేమి గోరీనో తాను       ॥ అందు ॥

నవ్వి నవ్వి మేలమాడీ ననుపున నీతోను
నివ్వటిల్లఁ దనయాస నీపై నెంతో
యివ్వల శ్రీవేంకటేశ యేలితిని నన్ను నేఁడు
రవ్వగాఁ దాఁ గాఁగిలించి రతికెక్క నిపుడు   ॥ అందు ॥


Pallavi

Andulakē veragayyī nappaṭanuṇḍi nāku
kanduva nennāḷlanuṇḍi kācukavunnadiyō

Charanams

1.Kotta kotta mām̐ṭa lāḍī komali nī tōḍuta
yittala vāvini nīku nīmaunōkāni
hatti koluvulu sēsī nappaṭi vēḍukatōḍa
batti nīpai nentagaddō bhāvin̄citēm̐ danaku

2.Solasi solasi ninnum̐ jūcīni palumāru
polupuga nēnām̐ṭipondugāni
celarēm̐gi sēyarāni sēvalellām̐ jēsī nīku
kolam̐dimīra ninnēmi gōrīnō tānu

3.Navvi navvi mēlamāḍī nanupuna nītōnu
nivvaṭillam̐ danayāsa nīpai nentō
yivvala śrīvēṅkaṭēśa yēlitini nannu nēm̐ḍu
ravvagām̐ dām̐ gām̐gilin̄ci ratikekka nipuḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.