Main Menu

Aape Cheppinatte Sesi (ఆపె చెప్పినట్టె సేసి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1875 | Keerthana 441 , Volume 28

Pallavi: Aape Cheppinatte Sesi (ఆపె చెప్పినట్టె సేసి)
ARO: Pending
AVA: Pending

Ragam: Malavi Gowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆపె చెప్పినట్టె సేసి యాదరించఁదగు నీకు
కాఁపురము లీడేరెఁ గరుణించవయ్యా    ॥ పల్లవి ॥

అందెలుఁ బాయవట్టాలు అట్టె గల్లు గల్లనఁగ
యిందుముఖి వచ్చెను నీ యింటికి నేఁడు
గందము బేంట్లు మేనఁ గమ్ముకొని రాఁగాను
ముందుగానే చేతులెత్తి మొక్కీ నీకు నిపుడు ॥ ఆపె ॥

కట్టిన చెంగావి చీరఁ గళబెళమనఁగాను
చుట్టమై బాగాలు దెచ్చె సూడిదెగాను
గట్టి కొప్పలో విరులు కడు బుగులుకొనఁగా
గుట్టుతోడ నీ సంగడిఁ గూచున్న దిపుడు   ॥ ఆపె ॥

చన్ను మెరుఁగులు నీపై సారెఁ జౌకళించఁగాను
యెన్నికగాఁ గాఁగిలించె నింపులు రేఁగ
మన్నించి శ్రీవేంకటేశ మరి నన్ను నేలఁగాను
సన్నలనే మోవి చూపీ చవితోఁ దా నిపుడు ॥ ఆపె ॥

Pallavi

Āpe ceppinaṭṭe sēsi yādarin̄cam̐dagu nīku
kām̐puramu līḍērem̐ garuṇin̄cavayyā

Charanams

1.Andelum̐ bāyavaṭṭālu aṭṭe gallu gallanam̐ga
yindumukhi vaccenu nī yiṇṭiki nēm̐ḍu
gandamu bēṇṭlu mēnam̐ gam’mukoni rām̐gānu
mundugānē cētuletti mokkī nīku nipuḍu

2.Kaṭṭina ceṅgāvi cīram̐ gaḷabeḷamanam̐gānu
cuṭṭamai bāgālu decce sūḍidegānu
gaṭṭi koppalō virulu kaḍu bugulukonam̐gā
guṭṭutōḍa nī saṅgaḍim̐ gūcunna dipuḍu

3.Cannu merum̐gulu nīpai sārem̐ jaukaḷin̄cam̐gānu
yennikagām̐ gām̐gilin̄ce nimpulu rēm̐ga
mannin̄ci śrīvēṅkaṭēśa mari nannu nēlam̐gānu
sannalanē mōvi cūpī cavitōm̐ dā nipuḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.