Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1935 | Keerthana 147 , Volume 29
Pallavi: Alamelumamgavu Nee Vaataniki (అలమేలుమంగవు నీ వాతనికి)
ARO: Pending
AVA: Pending
Ragam:Desakshi
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అలమేలుమంగవు నీ వాతనికి దేవులవు
వెలసి కూడితి విఁక వెరగందేవేమే ॥ పల్లవి ॥
ననిచిన కాంతులకు నవ్వులు వేగమే వచ్చు
మనసులెనసినట్టి మగనితోను
చెనకితేఁ జాలును సిగ్గులు చాలా నిండు
వనితరో నీవేల వంచేవే శిరసు ॥ అల ॥
తగులుగలవారికి తనువెల్లాఁ జెమరించు
జిగిమించ రమణుని చెంత నుండితే
మొగమెత్తి చూచితేను ముంచు మదనకళలు
వెగటుగాఁ దెర యేల వేసుకొనేవే ॥ అల ॥
వావిగల సతులకు వలపులు గడు రేఁగు
శ్రీవేంకటేశుఁడైన చెలువునొద్ద
చేవదేరఁ బెనఁగితే చిన్నలెల్లాఁ గానవచ్చు
కావరానఁ బయ్యదేల కప్పుకోనేలే ॥ అల ॥
Pallavi
Alamēlumaṅgavu nī vātaniki dēvulavu
velasi kūḍiti vim̐ka veragandēvēmē
Charanams
1.Nanicina kāntulaku navvulu vēgamē vaccu
manasulenasinaṭṭi maganitōnu
cenakitēm̐ jālunu siggulu cālā niṇḍu
vanitarō nīvēla van̄cēvē śirasu
2.Tagulugalavāriki tanuvellām̐ jemarin̄cu
jigimin̄ca ramaṇuni centa nuṇḍitē
mogametti cūcitēnu mun̄cu madanakaḷalu
vegaṭugām̐ dera yēla vēsukonēvē
3.Vāvigala satulaku valapulu gaḍu rēm̐gu
śrīvēṅkaṭēśum̐ḍaina celuvunodda
cēvadēram̐ benam̐gitē cinnalellām̐ gānavaccu
kāvarānam̐ bayyadēla kappukōnēlē
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.