Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 364 | Keerthana 375, Volume 4
Pallavi:Adaramma Padaramma (ఆడరమ్మ పాడరమ్మ)
ARO: Pending
AVA: Pending
Ragam:Lalitha
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ
వేడుకఁ బరుషలెల్ల వీధినుండరమ్మా ॥ పల్లవి॥
అల్లదివో వోఁగునూఁతులౌభళేశుపెద్దకోవ
వెల్లి పలనీటిజాలు వెడలేసోన
చల్లనిమాఁకులనీడ సంగడిమేడలవాడ
యెల్లగాఁగ నరసింహుఁడేగీ నింతితోడను ॥ ఆడ॥
సింగారపుమండపాల సింహాలమునిమంద-
లంగపు తెల్ల గోపుర మదె మిన్నంద
చెంగట నాడు వార్లు చేరి పన్నిద్దరుఁగొల్వ
సంగతిఁ దాఁగొలువిచ్చీ జయనరసింహము ॥ ఆడ॥
కందువ శ్రీ వేంకటేశు కల్యాణములవేది
అందమై భూములకెల్లా నాదికి నాది
మందల పాలకొండమలకు నట్టనడుమ
విందగు దాసులతోడ విహరించీ దేవుఁడు ॥ ఆడ ॥
Pallavi
Āḍaram’ma pāḍaram’ma aṅganalu cūḍaram’ma
vēḍukam̐ baruṣalella vīdhinuṇḍaram’mā
Charanams
1.Alladivō vōm̐gunūm̐tulaubhaḷēśupeddakōva
velli palanīṭijālu veḍalēsōna
callanimām̐kulanīḍa saṅgaḍimēḍalavāḍa
yellagām̐ga narasinhum̐ḍēgī nintitōḍanu
2.Siṅgārapumaṇḍapāla sinhālamunimanda-
laṅgapu tella gōpura made minnanda
ceṅgaṭa nāḍu vārlu cēri panniddarum̐golva
saṅgatim̐ dām̐goluviccī jayanarasinhamu
3.Kanduva śrī vēṅkaṭēśu kalyāṇamulavēdi
andamai bhūmulakellā nādiki nādi
mandala pālakoṇḍamalaku naṭṭanaḍuma
vindagu dāsulatōḍa viharin̄cī dēvum̐ḍu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.