Main Menu

Amgana Yettumdina (అంగన యెట్టుండినా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 102 | Keerthana 11, Volume 7

Pallavi:Amgana Yettumdina (అంగన యెట్టుండినా)
ARO: Pending
AVA: Pending

Ragam:Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగన యెట్టుండినా నమరుఁగాక
సంగతే నీకు నాపె సాటికిఁ బెనఁగను    ॥ పల్లవి ॥

తనకుఁ బోఁదైనచోట తగిలి మాటాడకున్న
మనుజుఁడా వాఁడు పెద్దమాకు గాక
చనవునఁ బెనఁగఁగా సమ్మతించకుండితేను
ఘనత యేది? చులకఁదనమే కాక      ॥ అంగన ॥

చెల్లుబడి గలచోట సిగ్గులు విడువకున్న
బల్లిదుఁడా వాఁడు కడు పందగాక
వెల్లివిరి నవ్వఁగాను వీడుదోళ్ళాడకున్న
చల్లేటి వలపులేవి? సటలింతే కాక      ॥ అంగన ॥

తారుకాణలైనచోట తమకించి కూడకున్న
చేరఁగ జాణఁడా గోడచేరుపు గాక
యీరీతి శ్రీ వేంకటేశ యిట్టె రఘునాథుఁడవై
కూరిమిఁ గూడితివిది కొత్తలింతే కాక     ॥ అంగన ॥


Pallavi

Aṅgana yeṭṭuṇḍinā namarum̐gāka
saṅgatē nīku nāpe sāṭikim̐ benam̐ganu

Charanams

1.Tanakum̐ bōm̐dainacōṭa tagili māṭāḍakunna
manujum̐ḍā vām̐ḍu peddamāku gāka
canavunam̐ benam̐gam̐gā sam’matin̄cakuṇḍitēnu
ghanata yēdi? Culakam̐danamē kāka

2.Cellubaḍi galacōṭa siggulu viḍuvakunna
ballidum̐ḍā vām̐ḍu kaḍu pandagāka
velliviri navvam̐gānu vīḍudōḷḷāḍakunna
callēṭi valapulēvi? Saṭalintē kāka

3.Tārukāṇalainacōṭa tamakin̄ci kūḍakunna
cēram̐ga jāṇam̐ḍā gōḍacērupu gāka
yīrīti śrī vēṅkaṭēśa yiṭṭe raghunāthum̐ḍavai
kūrimim̐ gūḍitividi kottalintē kāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.