Main Menu

Alapu Dirchukoradaa (అలపు దీర్చుకోరాదా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1007 | Keerthana 38 , Volume 20

Pallavi:Alapu Dirchukoradaa (అలపు దీర్చుకోరాదా)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhoopalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలపు దీర్చుకోరాదా అన్నీ నయ్యీఁ గాని
నిలువెల్లాఁ జెమరించి నీళ్లుగారీని      ॥ పల్లవి ॥

వీడె మందుకొనరాదా వెనక విచ్చేతుగాని
బీడై నీకెమ్మోవి పిప్పిగట్టెను
చూడరాదా మమ్ముఁగొంత చొక్కి కన్నుమూతుగాని
అడా నీడా నుమ్మఁదాకి యలపుదేరీని     ॥ అల ॥

పాద మొత్తించుకోరాదా పక్కన నవ్వుదుగాని
వీదులెల్లాఁ దిరుగాడి విసిగినది
జూదమైనా నాడరాదా సొంట్లు సోదింతుగాని
అదిగొని కోరికలు అంకెకుఁ దీసీని      ॥ అల ॥

పవళించి వుండరాదా పానుపుపై నిఁకనైనా
జవళిఁ బులుకలు మై జడిసీని
యివల శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
సవతులఁ దేకుమీ చలమెక్కీని        ॥ అల ॥

Pallavi

Alapu dīrcukōrādā annī nayyīm̐ gāni
niluvellām̐ jemarin̄ci nīḷlugārīni

Charanams

1.Vīḍe mandukonarādā venaka viccētugāni
bīḍai nīkem’mōvi pippigaṭṭenu
cūḍarādā mam’mum̐gonta cokki kannumūtugāni
aḍā nīḍā num’mam̐dāki yalapudērīni

2.Pāda mottin̄cukōrādā pakkana navvudugāni
vīdulellām̐ dirugāḍi visiginadi
jūdamainā nāḍarādā soṇṭlu sōdintugāni
adigoni kōrikalu aṅkekum̐ dīsīni

3.Pavaḷin̄ci vuṇḍarādā pānupupai nim̐kanainā
javaḷim̐ bulukalu mai jaḍisīni
yivala śrīvēṅkaṭēśa yiṭṭe nannum̐ gūḍitivi
savatulam̐ dēkumī calamekkīni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.