Main Menu

Alukaletiki Rave (అలుక లేటికి రావే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 554 | Keerthana 260 , Volume 13

Pallavi: Alukaletiki Rave (అలుక లేటికి రావే)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలుక లేటికి రావే యాతనివద్దకి నీవు
బలిమైతే వలపులు పదనుకు వచ్చునా       ॥ పల్లవి ॥

సంగడి నున్న సతికి చనవులు గలుగుగాక
కంగి కడనుండితేను కలదా పొందు
చెంగటనున్న రుచులు చేరి నోరూరించుగాక
అంగడినున్న సొమ్ములు ఆసలు పుట్టించునా   ॥ అలుక ॥

వినయపుటింతికిని వేడుక లీడేరుగాక
పెనగుచు బిగిసితే ప్రేమపుట్టునా
తనువున బూసిన గందము చల్లనౌగాక
వనములో తరువులు వడదీర్చవోపునా      ॥ అలుక ॥

సేవచేసే మగువకు చేతలెల్ళా జెల్లుగాక
యీవల నొడ్డారించితే నింపు వుట్టునా
శ్రీ వేంకటేశుడిందు విచ్చేసి తానిన్నుగూడెను
పూవులు పిందెలౌగక పొల్లు వెలవెట్టునా      ॥ అలుక ॥

Pallavi

Aluka lēṭiki rāvē yātanivaddaki nīvu
balimaitē valapulu padanuku vaccunā

Charanams

1.Saṅgaḍi nunna satiki canavulu galugugāka
kaṅgi kaḍanuṇḍitēnu kaladā pondu
ceṅgaṭanunna ruculu cēri nōrūrin̄cugāka
aṅgaḍinunna som’mulu āsalu puṭṭin̄cunā

2.Vinayapuṭintikini vēḍuka līḍērugāka
penagucu bigisitē prēmapuṭṭunā
tanuvuna būsina gandamu callanaugāka
vanamulō taruvulu vaḍadīrcavōpunā

3.Sēvacēsē maguvaku cētalelḷā jellugāka
yīvala noḍḍārin̄citē nimpu vuṭṭunā
śrī vēṅkaṭēśuḍindu viccēsi tāninnugūḍenu
pūvulu pindelaugaka pollu velaveṭṭunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.