Main Menu

Anuchu Deva (అనుచు దేవ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 137 | Keerthana 154 , Volume 2

Pallavi: Anuchu Deva (అనుచు దేవ)
ARO: Pending
AVA: Pending

Ragam: Salanga nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Anuchu Deva | అనుచు దేవ     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అనుచు దేవగంధర్వాదులు పలికేరు
కనకకశిపు నీవు ఖండించే వేళను        ॥ పల్లవి ॥

నరసింహ నరసింహ ననుఁగావు ననుఁగావు
హరి హరి నాకు నాకు నభయమీవే
కరిరక్ష కరిరక్ష గతమైరి దనుజులు
సురనాథ సురనాథ చూడు మమ్ముఁ గృపను ॥ అను ॥

దేవదేవ వాసుదేవ దిక్కు నీవే మాకు మాకు
శ్రీవక్ష శ్రీవక్ష సేవకులము
భూవనితనాథ నాథ పొడమె నీప్రతాపము
పావన పావన మమ్ముఁ బాలించవే      ॥ అను ॥

జయ జయ గోవింద శరణుచొచ్చేము నీకు
భయహర భయహర పాప మడఁగె
దయతో శ్రీవేంకటేశ తగిలి కాచితి మమ్ము
దయఁజూడు దయఁజూడు దాసులము నేము ॥ అను ॥

Pallavi

Anucu dēvagandharvādulu palikēru
kanakakaśipu nīvu khaṇḍin̄cē vēḷanu

Charanams

1.Narasinha narasinha nanum̐gāvu nanum̐gāvu
hari hari nāku nāku nabhayamīvē
karirakṣa karirakṣa gatamairi danujulu
suranātha suranātha cūḍu mam’mum̐ gr̥panu

2.Dēvadēva vāsudēva dikku nīvē māku māku
śrīvakṣa śrīvakṣa sēvakulamu
bhūvanitanātha nātha poḍame nīpratāpamu
pāvana pāvana mam’mum̐ bālin̄cavē

3.Jaya jaya gōvinda śaraṇucoccēmu nīku
bhayahara bhayahara pāpa maḍam̐ge
dayatō śrīvēṅkaṭēśa tagili kāciti mam’mu
dayam̐jūḍu dayam̐jūḍu dāsulamu nēmu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.