Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 153 | Keerthana 249 , Volume 2
Pallavi: Annita Nipempu (అన్నిటా నీపెంపు)
ARO: Pending
AVA: Pending
Ragam: Salanga nata
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Annita Nipempu | అన్నిటా నీపెంపు
Voice: V.B.Sai Krishna Yachendra
Awaiting Contributions.
అన్నిటా నీపెంపు వింత హనుమంత నీ –
వున్న చోటు నిశ్చింత వోహనుమంతా ॥ పల్లవి ॥
రామునిసేనలఁ గాచి రావణుగర్వ మడఁచి
ఆముకొన్నబలవంత హనుమంతా
గోమున జలధి దాఁటి కొండతో సంజీవి దెచ్చి
ధీమంతుఁడవైతి వింత దివ్యహనుమంత ॥ అన్ని ॥
చుక్కలు మొలపూసలై సూర్యమండలము మోఁచె
అక్కజపునీరూ పంత హనుమంత
చొక్కమై మీ రుండఁగాను సుగ్రీవాదులకెల్లా
అక్కర లే దించుకంతా హనుమంతా ॥ అన్ని ॥
జంగచాఁచి చేయెత్తి సరిఁ బిడికిలించుక
అంగము నిక్కించి తెంత హనుమంత
రంగగు శ్రీవేంకటాద్రిరామునిదేవి కిచ్చితి –
వంగులియ్యక మొక్కంత హనుమంతా ॥ అన్ని ॥
Pallavi
anniTA nIpEMpu viMta hanumaMta nI
vunna chOTu niSchiMta vOhanumaMtA
Charanams
1.rAmunisEnala gAchi rAvaNugarva maDachi
AmukOnnabalavaMta hanumaMtA
gOmuna jaladhi dATi kOMDatO saMjIvi dEchchi
dhImaMtuDavaiti viMta divyahanumaMta
2.chukkalu mOlapUsalai sUryamaMDalamu mOchE
akkajapunIrU paMta hanumaMta
chOkkamai mI ruMDagAnu sugrIvAdulakEllA
akkara lE diMchukaMtA hanumaMtA
3.jaMgachAchi chEyEtti sari biDikiliMchuka
aMgamu nikkiMchi tEMta hanumaMta
raMgagu SrIvEMkaTAdrirAmunidEvi kichchiti
vaMguliyyaka mOkkaMta hanumaMtA
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.