Main Menu

Aada Kela Pilicheve (ఆడ కేల పిలిచేవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 380 | Keerthana 475, Volume 11

Pallavi:Aada Kela Pilicheve (ఆడ కేల పిలిచేవే)
ARO: Pending
AVA: Pending

Ragam: Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals

Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడ కేల పిలిచేవే అప్పటి నన్ను
గోడ గడుఁగఁగ నేల గొబ్బున రాఁ గదవే        ॥ పల్లవి ॥

లోఁతఁకు జొచ్చినవాఁడు లోన నీమాట వినీనా
మూఁతి మీఁది కెత్తేవాఁడు మోము చూచీనా
చేఁతలు దవ్వెటివాఁడు సిగ్గు వడ నేరుచునా
పాఁతుమా కై వుండేవాఁడు పైకొనీనా        ॥ ఆడ కేల ॥

పెచ్చు వెరిగెటివాఁడు ప్రియము చేకొనునా
మచ్చరమే పెంచేవాఁడు మన సిచ్చీనా
వొచ్చెము వెదకేవాఁడు వొగి నిజ మెరుఁగునా
యెచ్చు కుందు చేఁతవాఁడు యిత వై చూచీనా   ॥ ఆడ కేల ॥

సటల మాటలవాఁడు సరవిగా నడచీనా
కుటిలపుగతివాఁడు గుట్టు చెప్పీనా
యిటు శ్రీవెంకటేశుఁడు యీమాటకే నన్నుఁ గూడె
యిటువలె నుండినామ యింకఁ బాసీనా      ॥ ఆడ కేల ॥


Pallavi

Āḍa kēla pilicēvē appaṭi nannu
gōḍa gaḍum̐gam̐ga nēla gobbuna rām̐ gadavē

Charanams

1.Lōm̐tam̐ku joccinavām̐ḍu lōna nīmāṭa vinīnā
mūm̐ti mīm̐di kettēvām̐ḍu mōmu cūcīnā
cēm̐talu davveṭivām̐ḍu siggu vaḍa nērucunā
pām̐tumā kai vuṇḍēvām̐ḍu paikonīnā

2.Peccu verigeṭivām̐ḍu priyamu cēkonunā
maccaramē pen̄cēvām̐ḍu mana siccīnā
voccemu vedakēvām̐ḍu vogi nija merum̐gunā
yeccu kundu cēm̐tavām̐ḍu yita vai cūcīnā

3.Saṭala māṭalavām̐ḍu saravigā naḍacīnā
kuṭilapugativām̐ḍu guṭṭu ceppīnā
yiṭu śrīveṅkaṭēśum̐ḍu yīmāṭakē nannum̐ gūḍe
yiṭuvale nuṇḍināma yiṅkam̐ bāsīnā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.