పద్యం:
సీ. ఆదినారాయణా | – యనుచు నాలుకతోడ
బలుక నేర్చినవారి – పాదములకు
సాష్టాంగముగ నమ – స్కార మర్పణ జేసి
ప్రస్తుతించెదనయ్య – బహువిధముల
ధరణిలో నరులెంత – దండివారైనను
నిన్ను గాననివారి – నే స్మరింప
మేము శ్రేష్ఠుల మంచు – మిదుకుచుంచెడివారి
చెంత జేరగనోను – శేషశయన
తే. పరమ సాత్వికులైన నీ – భక్తవరుల
దాసులకు దాసుడను జుమీ – ధాత్రిలోన
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ ఆదినారాయణా!నరసింహా!తొలిదేవుడవు. నీవే యనినెవరు నిన్నుపూజింతురో వారి పాదములకు సాష్టాంగ నమస్కారమొనరింతును. ప్రశంసింతును.నిన్నెఱుంగని వారెంత గొప్పవరైనను ఈ భూలోకాధిపతియైననూ వారిని నేను తలవను.ఓ శేషశయనా!గొప్పవారమని స్వార్థబుద్దితో,కీర్తికండూతితోనున్నవారిని దరిజేరనివ్వను.ఈభూమిపై మిక్కిలి శాంత స్వభావుడైన నీ భక్తశ్రేష్ఠులను భక్తితో సేవించెదను.
.
Poem:
See. Aadinaaraayanaa | – Yanuchu Naalukatoda
Baluka Nerchinavaari – Paadamulaku
Saashtaamgamuga Nama – Skaara Marpana Jesi
Prastutimchedanayya – Bahuvidhamula
Dharanilo Narulemta – Damdivaarainanu
Ninnu Gaananivaari – Ne Smarimpa
Memu Sreshthula Mamchu – Midukuchumchedivaari
Chemta Jeraganonu – Seshasayana
Te. Parama Saatvikulaina Nee – Bhaktavarula
Daasulaku Daasudanu Jumee – Dhaatrilona
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. aadinaaraayaNaa | – yanuchu naalukatODa
baluka nErchinavaari – paadamulaku
saaShTaaMgamuga nama – skaara marpaNa jEsi
prastutiMchedanayya – bahuvidhamula
dharaNilO naruleMta – daMDivaarainanu
ninnu gaananivaari – nE smariMpa
mEmu SrEShThula maMchu – midukuchuMcheDivaari
cheMta jEraganOnu – SEShaSayana
tE. parama saatvikulaina nee – bhaktavarula
daasulaku daasuDanu jumee – dhaatrilOna
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.