Main Menu

Adake Ne Vachchinappu Dayyeegaani (ఆడకే నే వచ్చినప్పు డయ్యీగాని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.979 | Keerthana 459, Volume 19

Pallavi: Adake Ne Vachchinappu Dayyeegaani (ఆడకే నే వచ్చినప్పు డయ్యీగాని)
ARO: Pending
AVA: Pending

Ragam:Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడకే నే వచ్చినప్పు డయ్యీఁ గాని
బూడిద వసంతమాడఁ బొమ్మనవే వానిని     ॥పల్లవి॥

వలపు జాతెఱఁగదు వాసి నీతి యెఱఁగదు
కలిమి ముందువెనక గాననియ్యదు
తెలిసితేఁ బసలేదు దిష్టమాయ మాకిన్ని
పొలసి కొసరనేల పొమ్మనవే వానిని      ॥ ఆడ ॥

కోపము దయయెఱఁగదు కూటమి సిగ్గెఱఁగదు
తీపులమోవి దప్పితీరనియ్యదు
రాఁపునేయఁ బనిలేదు రచ్చకెక్కఁ బనులెల్లా
పోపో అదేడసుద్ది పొమ్మనవే వానిని      ॥ ఆడ ॥

పాయము భీతెఱఁగదు పంతము తన్నెఱఁగదు
చాయలసన్నలముద్దు చవెఱఁగదు
యీయెడ శ్రీవేంకటేశుఁ డిపు డిట్టె నన్నుఁ గూడె
పోయి ఇట్టేవచ్చీఁగాని పొమ్మనవే వానిని     ॥ ఆడ ॥

Pallavi

Āḍakē nē vaccinappu ḍayyīm̐ gāni
būḍida vasantamāḍam̐ bom’manavē vānini

1.Valapu jāteṟam̐gadu vāsi nīti yeṟam̐gadu
kalimi munduvenaka gānaniyyadu
telisitēm̐ basalēdu diṣṭamāya mākinni
polasi kosaranēla pom’manavē vānini

2.Kōpamu dayayeṟam̐gadu kūṭami siggeṟam̐gadu
tīpulamōvi dappitīraniyyadu
rām̐punēyam̐ banilēdu raccakekkam̐ banulellā
pōpō adēḍasuddi pom’manavē vānini

3.Pāyamu bhīteṟam̐gadu pantamu tanneṟam̐gadu
cāyalasannalamuddu caveṟam̐gadu
yīyeḍa śrīvēṅkaṭēśum̐ ḍipu ḍiṭṭe nannum̐ gūḍe
pōyi iṭṭēvaccīm̐gāni pom’manavē vānini


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.