Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 333 | Keerthana 194 , Volume 11
Pallavi: Addo Maanavugaa A Deme (అద్దో మానవుగా అ దేమే)
ARO: Pending
AVA: Pending
Ragam:Bouliramakriya
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అద్దో మానవుగా అదేమే నీవు
గద్దించి నీవు చూచితే కాళ్లు వణఁకీనా ॥ పల్లవి ॥
మచ్చిక నాతఁడు నేడు మా యింటికి వచ్చె నంటా
పచ్చి గొంతా వెచ్చి గొంతాఁ బలికే వేమే
బచ్చెనల నతఁడు నీ సాంగెములో వాఁడై
నెచ్చెలి నీకుఁ గొంకితే నే నీకు వెరతునా ॥ అద్దో ॥
చెప్పి యిందరిలో వాఁడు చేయి నాపై వేసె నంటా
అప్పటనుండి వుడికే వ దేమే నీవు
దెప్పర మాతఁడు నీచేఁ దిట్టించుకొనుఁ గాక
నిప్పువంటిదాన నేను నీచేతఁ బడేనా ॥ అద్దో ॥
గక్కన శ్రీవెంకటాద్రిఘనుఁడు నన్నుఁ గూడితే
పక్కన నాతనిఁ గొంగు వట్టే వేమే
చక్క నీ వండ నుంటె సాదించఁ జెల్లుఁ గాక
యిక్కడ వచ్చే మనేవే యిక నే నోరుతునా ॥ అద్దో ॥
No comments yet.