Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 387 | Keerthana 509 , Volume 4
Pallavi: Ade Chudarayya (అదె చూడరయ్యా)
ARO: Pending
AVA: Pending
Ragam:Bouli
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Ade chudarayya | అదె చూడరయ్యా
Voice: Unknown
Ade Chudarayya | అదె చూడరయ్యా
Album: Private | Voice:
G.Bala Krishna Prasad
Awaiting Contributions.
అదె చూడరయ్యా పెద్దహనుమంతుని
గుదిగొని దేవతలు గొనియాడేరయ్యా ॥ పల్లవి ॥
వుదయాస్త శైలములు వొక జంగగాఁ జాఁచె
అదివో ధ్రువ మండల మందె శిరసు
చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు
యెదుట నీతని మహి మేమని చెప్పేమయ్యా ॥ అదె ॥
దండిగా బ్రహ్మాండముదాఁకఁ దోఁక మీఁదికెత్తె
మెండగు దిక్కులు నిండ మేను వెంచెను
గుండుగూడ రాకాసులఁ గొట్టఁగఁ జేతులు చాఁచె
అండనీతని ప్రతాప మరుదరుదయ్యా ॥ అదె ॥
దిక్కులు పిక్కటిలఁగ దేహరోమములు వెంచె
పక్కన లోకములకుఁ బ్రాణమై నిల్చె
ఇక్కడ శ్రీ వేంకటేశు హితవరిబంటాయ
మిక్కిలి నీతనిలావు మేలు మేలయ్యా ॥ అదె ॥
Pallavi
Ade cūḍarayyā peddahanumantuni
gudigoni dēvatalu goniyāḍērayyā
Charanams
1.Vudayāsta śailamulu voka jaṅgagām̐ jām̐ce
adivō dhruva maṇḍala mande śirasu
cadive sūryuni veṇṭa sāre mogamu drippucu
yeduṭa nītani mahi mēmani ceppēmayyā
2.Daṇḍigā brahmāṇḍamudām̐kam̐ dōm̐ka mīm̐dikette
meṇḍagu dikkulu niṇḍa mēnu ven̄cenu
guṇḍugūḍa rākāsulam̐ goṭṭam̐gam̐ jētulu cām̐ce
aṇḍanītani pratāpa marudarudayyā
3.Dikkulu pikkaṭilam̐ga dēharōmamulu ven̄ce
pakkana lōkamulakum̐ brāṇamai nilce
ikkaḍa śrī vēṅkaṭēśu hitavaribaṇṭāya
mikkili nītanilāvu mēlu mēlayyā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.