Main Menu

Adela Navvevamtaanadigevappatee (అదేల నవ్వేవంటానడిగేవప్పటీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 164 | Keerthana 376 , Volume 7

Pallavi: Adela Navvevamtaanadigevappatee (అదేల నవ్వేవంటానడిగేవప్పటీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదేల నవ్వేవంటా నడిగేవప్పటి నన్ను
సుదతులలో నిన్నుఁ జూచి నవ్వురాదా     ॥ పల్లవి ॥

ఇంటింటికేఁగి వచ్చి యిందరు నీవారంటా
నంటు చూపి మాటాడఁగా నవ్వురాదా
దంటయైన చెమటలచేఁ దడిసిన పచ్చడము
అంటించి చేతికియ్యఁగానందుకు నవ్వురాదా ॥ అదేల ॥

వెలఁదుల పొత్తులను విందులారగించి వచ్చి
నలిఁ జవులు చెప్పఁగా నవ్వురాదా
కొలువుకాంతలిచ్చిన గొప్ప నిమ్మపండ్లెల్లా
లలి నీచేనుండఁగా మెల్లనె నవ్వురాదా    ॥ అదేల ॥

పడఁతులకుఁ గప్పూరబాగాలు నీవు వెట్టఁగా
నడుమ నుండిన నాకు నవ్వురాదా
యెడయక శ్రీ వెంకటేశ నన్నునేలితివి
కడమలేని రతులకింకా నవ్వురాదా     ॥ అదేల ॥

Pallavi

Adēla navvēvaṇṭā naḍigēvappaṭi nannu
sudatulalō ninnum̐ jūci navvurādā

Charanams

1.Iṇṭiṇṭikēm̐gi vacci yindaru nīvāraṇṭā
naṇṭu cūpi māṭāḍam̐gā navvurādā
daṇṭayaina cemaṭalacēm̐ daḍisina paccaḍamu
aṇṭin̄ci cētikiyyam̐gānanduku navvurādā

2.Velam̐dula pottulanu vindulāragin̄ci vacci
nalim̐ javulu ceppam̐gā navvurādā
koluvukāntaliccina goppa nim’mapaṇḍlellā
lali nīcēnuṇḍam̐gā mellane navvurādā

3.Paḍam̐tulakum̐ gappūrabāgālu nīvu veṭṭam̐gā
naḍuma nuṇḍina nāku navvurādā
yeḍayaka śrī veṅkaṭēśa nannunēlitivi
kaḍamalēni ratulakiṅkā navvurādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.