Main Menu

Adhika Vidhyavanthulaprayojakulairi (అధిక విద్యావంతులప్రయోజకులైరి)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. అధిక విద్యావంతు – లప్రయోజకులైరి
పూర్ణశుంఠలు సభా – పూజ్యులైరి
సత్యవంతులమాట – జన విరోధంబాయె
వదరుబోతులమాట – వాసికెక్కె
ధర్మవాదనపరుల్ – దారిద్ర్యమొందిరి
పరమలోభులు ధన – ప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ – భూత పీడితులైరి
దుష్టమానవులు వ – ర్ధిష్ణులైరి

తే. పక్షివాహన | మావంటి – భిక్షుకులకు
శక్తిలేదాయె నిక నీవె – చాటు మాకు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరశింహా!ఈ లోకము కడు విచిత్రమైనది.అఖండులు అప్రయోజకులవతున్నారు.మోఢుడు సభాపూజ్యుడ వుతున్నాడు.నిజములాడునెవ్వరు నమ్మరు.అసత్యములాడు వారికి అధికప్రాధాన్యతవచ్చె.ధర్మబుద్ధికలవారు దారిద్ర్య మొందిరి. పిసినిగొట్టులు పసిడి కలవారైరి. పుణ్యవంతులు రోగభూతములచే పీడుతులైతిరి.దుష్టులు ధనవంతులైరి!ఓ గరుడవాహన!మావంటి భిక్షువులకు శక్తిలేదాయె!నీవే మాకు దిక్కు.
.


Poem:
See. Adhika Vidyaavamtu – Laprayojakulairi
Poornasumthalu Sabhaa – Poojyulairi
Satyavamtulamaata – Jana Virodhambaaye
Vadarubotulamaata – Vaasikekke
Dharmavaadanaparul – Daaridryamomdiri
Paramalobhulu Dhana – Praaptulairi
Punyavamtulu Roga – Bhoota Peeditulairi
Dushtamaanavulu Va – Rdhishnulairi

Te. Pakshivaahana | Maavamti – Bhikshukulaku
Saktiledaaye Nika Neeve – Chaatu Maaku.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. adhika vidyaavaMtu – laprayOjakulairi
poorNaSuMThalu sabhaa – poojyulairi
satyavaMtulamaaTa – jana virOdhaMbaaye
vadarubOtulamaaTa – vaasikekke
dharmavaadanaparul – daaridryamoMdiri
paramalObhulu dhana – praaptulairi
puNyavaMtulu rOga – bhoota peeDitulairi
duShTamaanavulu va – rdhiShNulairi

tE. pakShivaahana | maavaMTi – bhikShukulaku
SaktilEdaaye nika neeve – chaaTu maaku.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.