Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 43 | Keerthana 261 , Volume 1
Pallavi: Adimunula (ఆదిమునుల)
ARO: Pending
AVA: Pending
Ragam: Dhannasi
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
ఆదిమునుల సిద్ధాంజనము
యే దెసఁ జూచిన నిదివో వీఁడే ॥ పల్లవి ॥
నగిన సెలవిఁ బడు నాలుగుజగములు
మొగమునఁ జూపే మోహనము
నిగిడి యశోదకు నిధానంబై
పొగడొందీ గృహమున నిదె వీఁడే ॥ ఆది ॥
కనుదెరచిన నలుగడ నమృతము లటు
అనువునఁ గురసీ నపారము
వనితలు నందవ్రజమునఁ జెలఁగఁగ
మనికికి నిరవై మలసీ వీఁడే ॥ ఆది ॥
పరమునకునుఁ దాఁ బరమై వెలసిన-
పరిపూర్ణ పరాత్పరుఁడు
సరుస రుక్మిణికి సత్యభామకును
వరుఁడగు వేంకటవరదుఁడు వీఁడే ॥ ఆది ॥
Pallavi
Ādimunula sid’dhān̄janamu
yē desam̐ jūcina nidivō vīm̐ḍē
Charanams
1.Nagina selavim̐ baḍu nālugujagamulu
mogamunam̐ jūpē mōhanamu
nigiḍi yaśōdaku nidhānambai
pogaḍondī gr̥hamuna nide vīm̐ḍē
2.Kanuderacina nalugaḍa namr̥tamu laṭu
anuvunam̐ gurasī napāramu
vanitalu nandavrajamunam̐ jelam̐gam̐ga
manikiki niravai malasī vīm̐ḍē
3.Paramunakunum̐ dām̐ baramai velasina-
paripūrṇa parātparum̐ḍu
sarusa rukmiṇiki satyabhāmakunu
varum̐ḍagu vēṅkaṭavaradum̐ḍu vīm̐ḍē
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
please download of this audio song