Main Menu

Adugagaraadu Ninnu (అడుగగరాదు నిన్ను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1979 | Keerthana 410 , Volume 29

Pallavi: Adugagaraadu Ninnu (అడుగగరాదు నిన్ను)
ARO: Pending
AVA: Pending

Ragam: Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగఁగరాదు నిన్ను నడుగకుండఁగరాదు
చిడుముడి తమకము చిమ్మి రేఁగీ నాకును    ॥ పల్లవి ॥

చెక్కుల చెమట లవె చెంపలవెంట గారీ
యెక్కడనుండి వచ్చేవో యెఱఁగమయ్యా
గక్కన నీ మేననుండి గందపు బేఁటులు రాళీ
చక్కఁగా నే గరిడిని సాము చేసితివయ్యా     ॥ అడు ॥

ఆముకొని నీ మేన నలపులు దేరీని
యేమిపని సేసితివో యెఱఁగమయ్యా
వేమారు నీ సెలవుల వెన్నెలనవ్వు గురిసీ
దోమటి సంతోస మేడ దొరికెనయ్యా        ॥ అడు ॥

కందువ నీ మోమునఁ గమ్మీ నివ్వెరగులు
యెందున్నదో నీ చిత్త మెఱఁగమయ్యా
అందపు శ్రీవేంకటేశ యలమేల్మంగను నేను
చెందితివి నన్ను నీ చేఁతులు గంటిమయ్యా    ॥ అడు ॥

Pallavi

Aḍugam̐garādu ninnu naḍugakuṇḍam̐garādu
ciḍumuḍi tamakamu cim’mi rēm̐gī nākunu

Charanams

1.Cekkula cemaṭa lave cempalaveṇṭa gārī
yekkaḍanuṇḍi vaccēvō yeṟam̐gamayyā
gakkana nī mēnanuṇḍi gandapu bēm̐ṭulu rāḷī
cakkam̐gā nē gariḍini sāmu cēsitivayyā

2.Āmukoni nī mēna nalapulu dērīni
yēmipani sēsitivō yeṟam̐gamayyā
vēmāru nī selavula vennelanavvu gurisī
dōmaṭi santōsa mēḍa dorikenayyā

3.Kanduva nī mōmunam̐ gam’mī nivveragulu
yendunnadō nī citta meṟam̐gamayyā
andapu śrīvēṅkaṭēśa yalamēlmaṅganu nēnu
cenditivi nannu nī cēm̐tulu gaṇṭimayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.