Main Menu

Adugare Chelulaala Atanine Yeemaata (అడుగరే చెలులాల అతనినే యీమాట)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 978 | Keerthana 452 , Volume 19

Pallavi:Adugare Chelulaala Atanine Yeemaata (అడుగరే చెలులాల అతనినే యీమాట)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే చెలులాల ఆతనినే యీ మాట
యెడసిన విరహము యెవ్వరిదో కాని    ॥ పల్లవి ॥

చూపుల లోపలి యాస చూచుదాఁకా వేగిరము
యేపునఁ దనకు నాపై నెట్లోకాని
ఆపైఁ జన్నులయాస అంటుదాఁకా వేగిరము
వొపిక దనకుండునో వుండదోకాని    ॥ అడు ॥

మనసు లోపలి యాస మాటాడుదాఁ కా వేగిర-
మెనలేనితనకిఁక నెట్లోకాని
తనువుమీఁదటి యాస దగ్గరుదాఁకా వేగిర-
మనుగు తనకు సమ్మతౌనో కాదో     ॥ అడు ॥

కాఁగిటి యాస రెంటెము గప్పుదాఁకా వేగిరము
యేఁగివచ్చెఁ దనకైతే నెట్లోకాని
వీఁగక శ్రీ వేంకటాద్రి విభుఁడు నన్ను మన్నించె
చేఁగవేరె వలపులు సిగ్గులేవో కాని    ॥ అడు ॥

Pallavi

Aḍugarē celulāla ātaninē yī māṭa
yeḍasina virahamu yevvaridō kāni

Charanams

1.Cūpula lōpali yāsa cūcudām̐kā vēgiramu
yēpunam̐ danaku nāpai neṭlōkāni
āpaim̐ jannulayāsa aṇṭudām̐kā vēgiramu
vopika danakuṇḍunō vuṇḍadōkāni

2.Manasu lōpali yāsa māṭāḍudām̐ kā vēgira-
menalēnitanakim̐ka neṭlōkāni
tanuvumīm̐daṭi yāsa daggarudām̐kā vēgira-
manugu tanaku sam’mataunō kādō

3.Kām̐giṭi yāsa reṇṭemu gappudām̐kā vēgiramu
yēm̐givaccem̐ danakaitē neṭlōkāni
vīm̐gaka śrī vēṅkaṭādri vibhum̐ḍu nannu mannin̄ce
cēm̐gavēre valapulu siggulēvō kāni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.