పద్యం:
అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగ నధునీమరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
తాత్పర్యము:
ఎప్పుడును సత్యము పలుకువాఁడా,శరణన్నవారిని గాచువాఁడా,నీ దయయనెడు నదిలోఁగొట్టుకొని పోయిన పాపులయెల్ల పాపములు గలవాఁడా,బ్రాహ్మణులను సంతోషపెట్టువాఁడా, ముల్లోకములను బవిత్రము చేయునట్టి యాకాశగంగయనెడు మకరందముతోఁ గూడిన పాదపద్మముల విశేషముగలవాఁడా (శ్రీరాముడు విష్ణువు నవతారమే, అందుచే విష్ణుపాదోద్బవయగు నాకాశగంగ శ్రీరాముని పాదపద్మములందలి మకరంద మనుట.) రత్నకాంతులచే ధగధగలాడునట్లు చేయఁబడిన యలంకారములు గలవాఁడా,భద్రాద్రి రామా,దయాసముద్రా!
.
Poem:
Aganita Satyabhaasha, Saranaagataposha, Dayaalasajgharee
Vigata Samastadosha, Pruthiveesuratosha, Triloka Pootakru
Dgaga Nadhuneemaramda Padakamja Visesha Maniprabhaa Dhaga
Ddhagita Vibhoosha Bhadragiri Daasarathee Karunaapayonidhee.
.
Poem:
agaNita satyabhaaSha, SaraNaagatapOSha, dayaalasajgharee
vigata samastadOSha, pRuthiveesuratOSha, trilOka pootakRu
dgaga nadhuneemaraMda padakaMja viSESha maNiprabhaa dhaga
ddhagita vibhooSha bhadragiri daaSarathee karuNaapayOnidhee.
.
No comments yet.