Main Menu

Akkada Nekkadinarakamu (అక్కడ నెక్కడినరకము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 259 | Keerthana 340 , Volume 3

Pallavi:Akkada Nekkadinarakamu (అక్కడ నెక్కడినరకము)
ARO: Pending
AVA: Pending

Ragam: Dhannasi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అక్కడ నెక్కడి నరకము ఆ మాటే కల్లా
దిక్కుల ని(నిం?)దె ఇన్నియుఁ దీరుచుకొంటిమయ్యా       ॥ పల్లవి ॥

తనువిది మలమూత్రంబుల(లు?) దాకొనియుండిన పట్ణము
దినదినమును వుచ్చిష్టపుదిడ్లఁ దూరెదము
జననము నెత్తురు నెమ్ములు సారెకు నూరెడిగుంతలు
మనిమని నరకము చొచ్చిన మనుజుల మిదె నేము       ॥ అక్క ॥

మదనజలంబుల కాలువ మాపెద్దల పూర్వంబులు(?)
పొదలిన పుత్రుల యిసిళ్లపుట్టలు వెట్టెదము
యెదుటనె సంసారంబులు యెడయని కారాగృహములు
మదిమది నరకము చవిగొను మనుజుల మిదె నేము      ॥ అక్క ॥

వుట్టినదే నగ్నత్వము బూతో బండో యెరఁగము
చిట్టంట్లవాచవులగు జీవుల మ్రింగెదము
నెట్టన శ్రీవేంకటేశ్వర నీతోఁ గూడఁగ జగములు
మట్టినచోటే మట్టే మనుజుల మిదె నేము          ॥ అక్క ॥

Pallavi

Akkaḍa nekkaḍi narakamu ā māṭē kallā
dikkula ni(niṁ?)De inniyum̐ dīrucukoṇṭimayyā

Charanams

1.Tanuvidi malamūtrambula(lu?) Dākoniyuṇḍina paṭṇamu
dinadinamunu vucciṣṭapudiḍlam̐ dūredamu
jananamu netturu nem’mulu sāreku nūreḍiguntalu
manimani narakamu coccina manujula mide nēmu

2.Madanajalambula kāluva māpeddala pūrvambulu(?)
Podalina putrula yisiḷlapuṭṭalu veṭṭedamu
yeduṭane sansārambulu yeḍayani kārāgr̥hamulu
madimadi narakamu cavigonu manujula mide nēmu

3.Vuṭṭinadē nagnatvamu būtō baṇḍō yeram̐gamu
ciṭṭaṇṭlavācavulagu jīvula mriṅgedamu
neṭṭana śrīvēṅkaṭēśvara nītōm̐ gūḍam̐ga jagamulu
maṭṭinacōṭē maṭṭē manujula mide nēmu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.