Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 5 | Keerthana 30 , Volume 1
Pallavi: Alaagupomdulunu (ఆలాగుపొందులును)
ARO: Pending
AVA: Pending
Ragam: Aahiri
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
ఆలాగుపొందులును నటువంటి కూటములు
యీలాగులౌట నే డిదె చూడనయితి ॥ పల్లవి ॥
అడియాసచూపులకు నాసగించితిఁగాని
వెడమాయలని లోను వెదకలేనైతి
కడువేడుకలఁ దగిలి గాసిఁ బొందితిఁగాని
యెడలేనిపరితాప మెఱఁగలేనైతి ॥ ఆలా ॥
చిరునగవుమాటలకుఁ జిత్తగించితిఁగాని
తరితీపులని లోనుఁ దలఁపలేనైతి
వరుస మోహపుఁ బసలవలలఁ జిక్కితిఁగాని
గరువంపుఁ బొలయలుక గానలేనైతి ॥ ఆలా ॥
శ్రీవేంకటేశ్వరునిఁ జింత సేసితిఁగాని
దేవోత్తమునిలాగుఁ దెలియలేనైతి
యీవైభవముపై నిచ్చగించితిఁగాని
యీవైభవానంద మిది పొందనైతి ॥ ఆలా ॥
Pallavi
Ālāgupondulunu naṭuvaṇṭi kūṭamulu
yīlāgulauṭa nē ḍide cūḍanayiti
Charanams
1.Aḍiyāsacūpulaku nāsagin̄citim̐gāni
veḍamāyalani lōnu vedakalēnaiti
kaḍuvēḍukalam̐ dagili gāsim̐ bonditim̐gāni
yeḍalēniparitāpa meṟam̐galēnaiti
2.Cirunagavumāṭalakum̐ jittagin̄citim̐gāni
taritīpulani lōnum̐ dalam̐palēnaiti
varusa mōhapum̐ basalavalalam̐ jikkitim̐gāni
garuvampum̐ bolayaluka gānalēnaiti
3.Śrīvēṅkaṭēśvarunim̐ jinta sēsitim̐gāni
dēvōttamunilāgum̐ deliyalēnaiti
yīvaibhavamupai niccagin̄citim̐gāni
yīvaibhavānanda midi pondanaiti
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.