Main Menu

Alameelumamgavu Nee (అలమేలు మంగవు నీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 906 | Keerthana 31 , Volume 19

Pallavi: Alameelumamgavu Nee (అలమేలుమంగవు నీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Manohari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలమేలుమంగవు నీ వన్నిటా నేరుపరివి
చలములేఁటికి నిఁక సమ్మతించవే       ॥ పల్లవి ॥

విడియము చేతికిచ్చి విభుఁడు వేడుకపడి
వొడివట్టి పెనఁగగా నొద్దనకువే
వుడివోని వేడుకతో నుంగరము చేతికిచ్చి
యెడయక వేఁడుకొనఁగా నియ్యకొనవే       ॥ అల ॥

చిప్పిలువలపుతోడ చెక్కులు నొక్కుచు మోవిఁ-
గప్పుర మందియ్యఁగాను కాదనకువే
కొప్పు దువ్వి బుజ్జగించి కొసరి మాటలాడి
అప్పసము నవ్వఁగాను అట్టె కానిమ్మనవే     ॥ అల ॥

యిచ్చగించి శ్రీ వేంకటేశ్వరుఁడు నిన్నుఁ గూడి
మచ్చికఁ గాఁగిలించఁగాను మారాడకువే
పచ్చడము మీఁదఁ గప్పి పట్టపుదేవులఁ జేసి
నిచ్చలాన నేలుకొనె నీవూఁ గైకొనవే        ॥ అల ॥

Pallavi

Alamēlumaṅgavu nī vanniṭā nēruparivi
calamulēm̐ṭiki nim̐ka sam’matin̄cavē

Charanams

1.Viḍiyamu cētikicci vibhum̐ḍu vēḍukapaḍi
voḍivaṭṭi penam̐gagā noddanakuvē
vuḍivōni vēḍukatō nuṅgaramu cētikicci
yeḍayaka vēm̐ḍukonam̐gā niyyakonavē

2.Cippiluvalaputōḍa cekkulu nokkucu mōvim̐-
gappura mandiyyam̐gānu kādanakuvē
koppu duvvi bujjagin̄ci kosari māṭalāḍi
appasamu navvam̐gānu aṭṭe kānim’manavē

3.Yiccagin̄ci śrī vēṅkaṭēśvarum̐ḍu ninnum̐ gūḍi
maccikam̐ gām̐gilin̄cam̐gānu mārāḍakuvē
paccaḍamu mīm̐dam̐ gappi paṭṭapudēvulam̐ jēsi
niccalāna nēlukone nīvūm̐ gaikonavē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.