Main Menu

Alamelumamgavu Neevoune (అలమేలుమంగవు నీవౌనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1821 | Keerthana 118 , Volume 28

Pallavi:Alamelumamgavu Neevoune (అలమేలుమంగవు నీవౌనే)
ARO: Pending
AVA: Pending

Ragam:Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలమేలుమంగవు నీవౌనే పతిఁ జేకొంటివి
నెలకొని యీ చేఁతలు నీవే నేరుతువే      ॥ పల్లవి ॥

మొగము చూడఁగనే ముంచుకొను నగవులు
నగఁగనే పెనగొని నాఁటుఁ దగులు
తగులఁగఁ దగులఁగాఁ దమకము చిగిరించు
చిగిరింపునాసలు చిమ్మిరేఁచువలపు       ॥ అల ॥

పలవఁగా వలవఁగా వడిఁబెట్టుఁ దలఁపులు
తలఁచఁగా నోరికబ్బు తానే పిలుపు
పిలువఁగాఁ బిలువఁగాఁ బెనలుఁగొనుఁజెలిమి
చెలిమి గడుఁ జేయఁగా చెలరేఁగు మనసు    ॥ అల ॥

మనసు పెట్టఁ బెట్టఁగా మల్లడిగొను ననుపు
ననుచఁగా ననుచఁగా నంటు లెనయు
యెనయఁగా శ్రీవేంకటేశుఁ డేలేగుట్టు గను
కనుఁగొనఁగానే చెంగలించు మొగము      ॥ అల ॥

Pallavi

Alamēlumaṅgavu nīvaunē patim̐ jēkoṇṭivi
nelakoni yī cēm̐talu nīvē nērutuvē

Charanams

1.Mogamu cūḍam̐ganē mun̄cukonu nagavulu
nagam̐ganē penagoni nām̐ṭum̐ dagulu
tagulam̐gam̐ dagulam̐gām̐ damakamu cigirin̄cu
cigirimpunāsalu cim’mirēm̐cuvalapu

2.Palavam̐gā valavam̐gā vaḍim̐beṭṭum̐ dalam̐pulu
talam̐cam̐gā nōrikabbu tānē pilupu
piluvam̐gām̐ biluvam̐gām̐ benalum̐gonum̐jelimi
celimi gaḍum̐ jēyam̐gā celarēm̐gu manasu

3.Manasu peṭṭam̐ beṭṭam̐gā mallaḍigonu nanupu
nanucam̐gā nanucam̐gā naṇṭu lenayu
yenayam̐gā śrīvēṅkaṭēśum̐ ḍēlēguṭṭu ganu
kanum̐gonam̐gānē ceṅgalin̄cu mogamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.