Main Menu

Ali Magani Memi (ఆలి మగని మేమి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1967 | Keerthana 342 , Volume 29

Pallavi:Ali Magani Memi (ఆలి మగని మేమి)
ARO: Pending
AVA: Pending

Ragam: Sindhuramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆలి మగని తగవులవిగో చెప్పితి నీకు
వాలాయముగా మఱవక తలఁచుకొమ్మీ       ॥ పల్లవి ॥

యెడసిన తమితోడ నెంతయినా సొలతురు
పడఁతులయ్యినవారు పతిని
అడరి నీవు రావలెనని చెలికత్తెలచే
యెడ మాఁటల దూరితి నెగ్గుపట్టేవు సుమ్మీ     ॥ ఆలి ॥

కాఁకఁ బొరలినందుకు కైమీరి చెనకుదురు
యేఁకరిన సతులు త మ్మేలినవాని
తేఁకువతో నీవు నన్ను దిష్టించి చూడవలసి
పోఁక పూఁబిలవేసితి పొంచి వోరుచుకొమ్మీ     ॥ ఆలి ॥

అంచెలఁ గూడేటి వేళ అట్టె యేమైనాఁ జేతురు
పొంచుకున్న వనితలు పొందైనవాని
యెంచఁగ శ్రీవేంకటేశ యెనసేవేళ నీ మోవి
యించుక గంటిసేసితి నేమీ ననకుమీ       ॥ ఆలి ॥

Pallavi

Āli magani tagavulavigō ceppiti nīku
vālāyamugā maṟavaka talam̐cukom’mī

Charanams

1.Yeḍasina tamitōḍa nentayinā solaturu
paḍam̐tulayyinavāru patini
aḍari nīvu rāvalenani celikattelacē
yeḍa mām̐ṭala dūriti neggupaṭṭēvu sum’mī

2.Kām̐kam̐ boralinanduku kaimīri cenakuduru
yēm̐karina satulu ta m’mēlinavāni
tēm̐kuvatō nīvu nannu diṣṭin̄ci cūḍavalasi
pōm̐ka pūm̐bilavēsiti pon̄ci vōrucukom’mī

3.An̄celam̐ gūḍēṭi vēḷa aṭṭe yēmainām̐ jēturu
pon̄cukunna vanitalu pondainavāni
yen̄cam̐ga śrīvēṅkaṭēśa yenasēvēḷa nī mōvi
yin̄cuka gaṇṭisēsiti nēmī nanakumī


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.